Food

చేపల పచ్చడి చేసేద్దాం

How to make fish pickle-Telugu style

*** కావలసినవి
చేపలు – అరకేజీ, పసుపు – చిటికెడు, నువ్వుల నూనె – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా.

*** మసాలా కోసం
ఎండుమిర్చి – 50గ్రాములు, పసుపు – పావుటీస్పూన్‌, జీలకర్ర – ఒక టేబుల్‌స్పూన్‌, ఎండుద్రాక్ష – 100గ్రాములు, గసగసాలు – రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, అల్లం ముక్క – కొద్దిగా, పచ్చిమిర్చి – నాలుగైదు, చింతపండు – కొద్దిగా, పంచదార – ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు – రెండు టేబుల్‌స్పూన్లు.

*** తయారీ
ముందుగా చేపలను కట్‌ చేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
తరువాత చేప ముక్కలకు పసుపు, ఉప్పు పట్టించాలి.
పాన్‌లో నూనె వేసి ఆ చేప ముక్కలు వేసి వేగించాలి.
మిక్సీలో ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, ఎండుద్రాక్ష, గసగసాలు వేసి మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి.
చిన్న పాత్రలో కొన్ని నీళ్లు పోసి చింతపండు నానబెట్టాలి.
అల్లం వెల్లుల్లిని పేస్టు చేసుకోవాలి.
పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి.
కాసేపు వేగిన తరువాత మసాలా పేస్టు వేసి కలపాలి.
ఇప్పుడు చింతపండు నీళ్లు పోసి, ఉప్పు, పంచదార వేసి కాసేపు ఉడికించాలి.
పచ్చిమిర్చి, ఆవాలు వేయాలి. చిన్నమంటపై పదినిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు వేగించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలపి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.