టాలీవుడ్‌లో 14 సినిమాల్లో పని చేశానని.. కాకపోతే ఇప్పటివరకూ తాను ఏ నిర్మాణ సంస్థతోనూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొలేదని టాలీవుడ్ నటి మెహరీన్ అన్నారు. ఇటీవల ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమా జనవరిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ముఖ్యమైన ఇంటర్వ్యూకి మెహరీన్ హాజరు కానప్పటికీ ఆమె హోటల్ బిల్స్‌ను తామె కట్టామని ‘అశ్వథ్థామ’ చిత్ర నిర్మాత చెప్పినట్లు పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మెహరీన్ సోషల్‌మీడియా వేదికగా తన గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ‘‘అశ్వథ్థామ’ సినిమా విషయంలో నా గురించి గత కొన్నిరోజులుగా పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఆ వివాదం గురించి నేను మాట్లాడకూడదనుకుని ఇన్ని రోజులు చాలా సైలెంట్‌గా ఉన్నాను. కానీ నా మర్యాదకు భంగం కలుగుతున్న తరుణంలో తప్పక స్పందించాల్సి వస్తోంది. సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ పూర్తి కాగానే కుటుంబసభ్యులతో గడిపేందుకు నేను పంజాబ్ వెళ్లాను. తర్వాత ‘అశ్వథ్థామ’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాను. కాకపోతే అదే సమయంలో మా తాతకు గుండెపోటు వచ్చింది. అయితే ఆ సమయంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో నాగశౌర్య సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత నేను ‘అశ్వథ్థామ’ ప్రమోషన్స్ అన్నింటిలోనూ భాగమయ్యాను. కాకపోతే స్కిన్ ఎలర్జీ రావడం వల్ల ఒక ఇంటర్వ్యూకి మాత్రం హాజరుకాలేకపోయాను. దీంతో నిర్మాత నా హోటల్ బిల్స్ కట్టనని చెప్పడం… తర్వాత నేను చెప్పడంతో నా మేనేజర్ బిల్స్ పే చేయడం జరిగింది. తెలుగులో నేను 14 సినిమాల్లో నటించాను. కానీ ఇప్పటివరకూ ఏ నిర్మాణ సంస్థతోనూ ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదు. నా వృత్తిపరమైన జీవితానికి భంగం కలుగుతున్నప్పుడు ఈ వివాదంపై స్పందించక తప్పలేదు. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేయాలని అనుకుంటున్నాను.’ అని మెహరీన్ అన్నారు. అయితే ‘అశ్వథ్థామ’ సినిమా గురించి మెహరీన్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట్లో మెహరీన్ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతుంది.
మెహ్రీన్ vs అశ్వథ్థామ నిర్మాతలు
Related tags :