Kids

అష్టా చెమ్మా….ఆడేద్దామా?

Ashta Chemma And Other Board Games For Mental Sharpness

ఏళ్ల కాలం నాటి పాచికలాటలో ఎత్తుకు పైఎత్తుల్నివేసి ప్రత్యర్థిని చిత్తు చేసేవారు. శత్రువుని మానసికంగా దెబ్బతీయాలని చదరంగాన్నిఎంచుకుని మరీ ఆడేవారు. ఆలా వ్యూహ, ప్రతి వ్యూహాలతో ఆటల్లో ఆడి ఓడి, ఓడించేవారు.నువ్వా నేనా అంటూ.. సరదాగా పోటీ పడే ఇద్దరు అన్నా చెల్లెమ్మలు, స్నేహితులనుంచీ.. ముద్దుకోసం ఆటలో ఓడిపోయిన ప్రియతముల వరకూ ఎందర్నో రకరకాలుగాఆడించేవి ఈ బోర్డు ఆటలు. కాలక్రమంలో కొన్ని బోర్డు ఆటలు కనుమరుగైతే, మరికొన్ని చాంపియన్‌షిప్‌ల వరకూ చేరాయి. టీవీ, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌లువచ్చాక మరిన్ని బోర్డు గేమ్స్‌ని వదిలేశాం. అయితే, మళ్లీఆనాటి బోర్డు గేమ్స్‌ను ‘హాబీవీక్‌’గా ప్రారంభించడంతో అనేక ఆటలకు ఆదరణ పెరుగుతోంది. వాటిలోకొన్నిటినైనా మనమూ ఆడుకోవాలి కదా..!*నేడు పిల్లల నుంచీ గృహిణుల వరకూ స్మార్ట్‌ ఫోన్‌లకు, టీవీలకు, అతుక్కుపోతూ ఉండటంతో అనేక శారీరక మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి.ఎందరో యువత స్మార్ట్‌ఫోన్‌కు బానిసై తమ జీవితాల్నే ప్రమాదంలో పడవేసుకుంటున్నారు.నేటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి కాసేపు సరదాగా ఆడుకోవడం వల్ల అనేకసమస్యలకు ఉపశమనం దొరికినట్టేనంటున్నారు నిపుణులు.
**చురుకైన ఆట..!
బెంగళూరుకు చెందిన శ్రీరంజిని అనే గృహిణి తొమ్మిదో తరగతి చదువుతున్నతన పిల్లవాడికి ఫోన్‌ వ్యసనంగా మారుతుండటంతో ‘గో గేమ్‌’ బోర్డును తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చింది. అందుకు ఒక షరతుని పెట్టిందిరోజుకు ఐదు నిమిషాలపాటు తనతో ఈ ఆటను ఆడాలని. గో గేమ్‌ ఆట ఇద్దరు కలిసి ఆడుకునేది.అందులో 64 గళ్ల బాక్స్‌తో ఒక బోర్డు, బ్ల్యాక్‌, వైట్‌ రాళ్లతో ఉంటుంది. ముందుగా నలుపురాయిని పెట్టడంతో ప్రారంభించాలి. తర్వాత వైట్‌. అలా వరుసగా ఒకే రంగుతో మూడునిలువుగా, అడ్డుగా లేక క్రాస్‌గా ఎవరు పెడతారోవారికి ఒకమార్క్‌ వచ్చినట్లు. ఈ బోర్డు 64 గళ్లతో బిగినర్స్‌ నుంచి 324 గళ్లతో ఎక్స్‌పర్ట్స్‌ వరకు ఉంటుంది. గళ్లు పెరిగేకొద్దీ ఆడేందుకుకష్టతరంగా ఉంటుంది. ఈ ఆట వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. నిజానికి గో గేమ్‌ ఆట 2500 ఏళ్ల క్రితం చైనీయులు తీసుకొచ్చారు.ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఆటల్లో ఇదీ ఒకటిగా నేటికీ నిలిచింది.**జెయింట్‌ బోర్డు..
1500 ఏళ్లనాటి ఆట ఇది. తొలుత చదరంగాన్ని ‘చతురంగ’ అని పిలిచేవారు. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో ప్రారంభమై పర్షియాకు పాకింది. పర్షియన్లు10వ శతాబ్దంలో ఈ ఆటని చెస్‌ అని పిలవడంప్రారంభించారు. అరబ్బులు పర్షియాను స్వాధీనపర్చుకున్నప్పుడు చదరంగాన్నితీసుకున్నారు. తర్వాత మారిష్‌ స్పెయిన్‌ను ఆక్రమణ ద్వారా చందరంగం ఐరోపాకువ్యాపించింది. అలా చదరంగం ఆట ఇద్దరి బుద్ధిబలాన్ని తెలిపేవిధంగా ఉండేది. చెస్‌బోర్డుతో ప్రాథమికం నుంచీ ఎక్స్‌పర్ట్స్‌ వరకూ ఆడి చాంపియన్‌షిప్‌ల్లోపోటీపడుతున్నారు. ఈ ఆట కంప్యూటర్‌లోనూ ఏఐ రూపంలో ప్రోగ్రామింగ్‌ చేశారు. ఎవరూలేకుండానే కంప్యూటర్‌లో ఒక్కరే ఆడుకోవచ్చు. అయితే, కాస్త వినూత్నంగా ఈ బోర్డు ఆటను ఇండోర్‌ నుంచి కాస్త అవుట్‌డోర్‌కుతీసుకొచ్చి జెయింట్‌ చెస్‌ను లండన్‌, న్యూజిల్యాండ్‌, నెదర్‌ల్యాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో సరదాగా ఆడేస్తున్నారు. ఇదే తరహాలో బెంగళూరులోహాబీ వీక్‌గా జెయింట్‌ చెస్‌తో పార్క్‌లను తీసుకొచ్చారు. మూడు నుంచి నాలగు అడుగులఎత్తులో ఉండే ఈ బోర్డుపైన పావుల్ని కదుపుతూ… ఇటు శరీరానికీ, మెదడుకు పదునుపెడుతూ… పిల్లల నుంచీపెద్దల వరకూ ఎత్తుకుపైఎత్తుల్ని వేస్తున్నారట..!
**పదాలతో భవంతులు…
చెస్‌, బ్రిడ్జ్‌ గేమ్‌ల తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ప్రాచుర్యంపొందిన బోర్డు ఆట ‘వర్డ్స్‌ బిల్డింగ్‌ గేమ్‌’. దీనిని 1931లో ఆల్ఫ్రెడ్‌ ఎం.బట్స్‌ అనే ఆర్కిటెక్ట్‌ రూపకల్పన చేసి ‘క్రిస్‌ క్రాస్‌’ అని, ‘క్రాస్వర్డ్‌ పజిల్‌’ అని పిలిచారు. దీనిని మళ్లీ రీ-డిజైన్‌ చేసి 1948లో ‘స్క్రాబుల్‌’ అని పేరు మార్చి మార్కెట్‌లో అమ్మారు. అయితే, ఆడేందుకు కష్టంగా ఉండటంతో 1954లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన జేమ్స్‌బ్రూనోట్‌ దీనిలోని స్వల్పమార్పులు చేసి 22 రకాలుగా బోర్డులను తయారుచేసి విక్రయించారు. అలా మన దేశంలో దీనినివర్డ్స్‌ బిల్డింగ్‌ గేమ్‌గా పిలుస్తాం. అక్షరాలతో అనేక పదాల్ని పేర్చుతూ..పదసంపదను పోగు చేసుకుంటూ.. సరికొత్త పదాలతో భవంతుల్ని కట్టేందుకు ఆడుతూ పాడుతూఅనేక విషయాల్ని నేర్చుకోవచ్చు. అనేక దేశాల్లో ఆటిజం పిల్లలకూ, మెదడు ఎదుగుదల సమస్యలున్నవారికీ, ఈ బోర్డు ద్వారా అనేక విషయాల్నితెలుపుతున్నారు. అంతేకాదు, పండ్లు, కూరగాయలు, రంగులు, ఆకారాలు, దేశాల పేర్లు, నదుల పేర్లు ఇలా రకరకాలుగా బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ బోర్డుపైనఅక్షరాలు, నంబర్లు, బొమ్మలు, రంగులు, పక్షులు, జంతువులు **ఆకారాలతో ఉంటాయి.
చిన్న వయసు నుంచే.. వీడియో గేమ్స్‌, పబ్జీ, ఫ్రీ ఫైర్‌ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు వ్యసనపరులుగా మారుతున్నారు.కొన్నిచోట్ల ప్రాణాల్ని పోగొట్టుకున్న పరిస్థితుల్ని చూశాం. అనేక దేశాల్లోనిపిల్లలపై, యువతపై పడుతోన్న చెడు ప్రభావాల్నితగ్గించేందుకు ఈ బోర్డు ఆటల ద్వారా సరికొత్తగా ప్రయోగాల్ని చేస్తున్నారు. ఇటువంటిఆటలు మనదేశంలోనూ విస్తారంగా ఆడేందుకు తగిన వేదికల్ని సమకూర్చుకోవాలి. ప్రస్తుతంఎదురయ్యే సమస్యల నుంచీ పక్కదారి పట్టకుండా సరైన మార్గం పట్టాలంటే.. తెలివితేటలకుపదునుపెట్టే బోర్డ్‌ గేమ్స్‌ను మొదలుపెట్టాల్సిందే..!
**ఆనాటి గడుల ఆటలు …
‘నైన్‌ మెన్స్‌ మోరిస్‌’ అతి పురాతనమైన బోర్డ్‌ ఆట ఇది. క్రీస్తుపూర్వం 1400 నాటి ఈజిప్టులో కుర్నా ఆలయం రూఫింగ్‌స్లాబ్‌పై లభించి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ఆట ఐరోపా అంతటా వ్యాపించింది. దీనినిమనదేశంలో పెద్ద దాడి, చిన్న దాడిగా ఆడేవారు. ఈ ఆటను ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు.*’ది రాయల్‌ గేమ్‌ ఆఫ్‌ యుర్‌’. ఇది క్రీ.పూ. 2600 నాటిది. 1920లో బ్రిటీషు పురావస్తు శాస్త్రవత్తే ‘సర్‌ చార్లెస్‌ లియోనార్డ్‌ వూలీ’ యుర్‌ రాయల్‌ సమాధుల్ని తవ్వినప్పుడుఇది బయటపడింది. ఆ ప్రాంతంలో మరిన్ని సమాధుల్లో తవ్వగా మొత్తం 20 బోర్డులు బయటపడ్డాయి. అయితే, వీటి నియమాలకు సంబంధించిన విషయాలుతెలియకపోవడంతో.. బోర్డు ఆధారంగా ఆధునిక వెర్షన్‌ నియమాలను కాస్త స్మార్ట్‌గారూపొందించి మార్కెట్‌లో విడుదల చేశారు.డ్రాఫ్ట్‌ అని కూడా పిలిచే చెకర్స్‌క్రీ.పూ. 3000 ఏళ్లనాటిది. అతిపురాతన బోర్డు ఆటల్లో ఒకటి. ఆధునిక ఇరాక్‌లో వెలుగుచూసింది. ఇది ఈనాటికీప్రాచుర్యంలో ఉంది. అయితే స్వల్ప వ్యత్యాసాలతో చెకర్లను పోలి ఉండే గేమ్‌ బోర్డ్‌కొన్నేళ్లుగా అనేక దేశాలకు పరిచయమైనా అమెరికన్‌ చెకర్స్‌, రష్యన్‌ డ్రాఫ్ట్‌గా ప్రపంచవ్యాప్తంగాప్రాచుర్యం పొందింది. 1885లో మొట్టమొదటి సారి ఈ ఆటను ఫ్రాన్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌నుప్రారంభించారు. దీని ఆధారంగానే ఆరుగురు కలిసి ఆడుకునే వీలుగా దీని డిజైన్‌ మార్చి ‘చైనీస్‌ చెకర్‌’ బోర్డు గేమ్‌గా తీసుకొచ్చారు
.*దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఆడే సాంప్రదాయ పురాతన తమిళపల్లన్‌కుంజి ఆట. ఇది కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, రాష్ట్రాలకూ శ్రీలంక, మలేషియా వంటి దేశాలకు వ్యాపించింది. వామన గుంటలు అని తెలుగులో, అలీ గులి మానే అని కన్నడలో, కుజిపారా అని మలయాళంలో పిలుస్తారు.దీనిని ఇద్దరు ఆడతారు. ఈ బోర్డులో 14 కప్పులుంటాయి. చింతపండు గింజలు లేక గవ్వల్ని ఉపయోగించి దీనినిఆడతారు. ఈ బోర్డు ఆట పూర్తిగా మరుగున పడిపోయిందనే చెప్పవచ్చు. దీనితోపాటు, ‘మేకా పులి’ లూడో, డైస్‌ ఆట, అష్టాచెమ్మా, ఐదు రాళ్ల ఆట వంటివెన్నో… బోర్డు లేకుండానే నేలపై గీతలు గీసుకునిఆడినవి నేడు పూర్తిగా వదిలేశాం.