ఆలియాభట్‌కు వరస విజయాలొస్తున్నాయి… చేతినిండా సినిమాలున్నాయి. అయినా ఎక్కడా తగ్గడం లేదు. కథలో కొత్తదనం…పాత్రలో వైవిధ్యం ఉంటే ఏదో విధంగా కాల్షీట్లు సర్దుబాటు చేసుకొని నటించడానికి సిద్ధమవుతుంది. తాజాగా ఓ కొత్త కథకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ‘హిందీ మీడియం’ దర్శకుడు సాకేత్ చౌదరి తదుపరి చిత్రంలో నాయికగా ఆలియాను తీసుకున్నట్టు సమాచారం. ‘‘ఆలియాకు కథ బాగా నచ్చింది. నటించడానికి సంసిద్ధంగానే ఉన్నారు. అధికారికంగా ఒప్పందాలు జరగలేదు’’అని సాకేత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సాజిద్ నడియాడ్ వాలా నిర్మించనున్న ఈ చిత్రం వినోదంతో కూడిన సోషల్ డ్రామాగా ఉండనుందట. హీరో ఎవరన్నది నిర్ణయించలేదు. ఆలియా ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’, ‘గంగూభాయ్ కతియావాడి’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఏడాది చివర్లో రణ్‌బీర్‌తో పెళ్లిపీటలెక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఆలియా…సరికొత్త వినోదాలు
Related tags :