తేనె గురించి తెలుసు… ఈ మానుకా తేనె ఏంటి? ఇదెక్కడి నుంచీ వచ్చింది అనుకుంటున్నారా… ప్రకృతి నుంచే… ప్రత్యేకతలు… ప్రయోజనాలు పరిశీలిద్దాం.
మీకు తెలుసు… తేనె అనేది ప్రకృతిలో ఓ అద్భుతం. తేనెటీగలు తేనెను సేకరించి… దాచుకోవడం, దాన్ని ప్రాసెస్ చేసి… ప్యాక్ చేసి మనకు ఇవ్వడం… ఆ శుద్ధమైన తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతూ మనం తేనెటీగలకు రుణపడిపోతున్నాం. ఎందుకంటే ఈ తేనె వల్ల మన ఆరోగ్యం మెరుగవుతోంది, మంచి ఆహారంగా ఇది ఉంటోంది, మన చర్మ కణాల్ని తేనె కాపాడుతోంది. జుట్టుకు కూడా రక్షణ కల్పిస్తోంది. ఐతే… తేనెల్లో కూడా చాలా రకాలున్నాయి. ఎందుకంటే… తేనెటీగలు తేనెను… ఏ పువ్వుల నుంచీ సేకరిస్తున్నాయన్నదాన్ని బట్టీ… తేనె టేస్ట్ ఉంటుంది. ఒక్కోసారి తేనె అంత తియ్యగా లేదనిపిస్తే… కొన్ని తేనె ప్యాకేజింగ్ కంపెనీలు… మనకు చెప్పకుండా… అందులో స్వీట్‌నర్స్ వంటివి కలుపుతాయి. అలాంటి తేనె వాడటం వల్ల మనకు సరైన ప్రయోజనాలు కలగవు. సరే… మరి ఈ మానుకా తేనె సంగతేంటో తెలుసుకుందాం.
మానుకా తేనెను మానుకా పువ్వుల నుంచీ తేనెటీగలు సేకరిస్తాయి. ఈ పువ్వులు న్యూజిలాండ్‌లో మాత్రమే ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన తేనె ఏదంటే… మానుకా తేనె అంటారు. నిజమైన మానుకా పువ్వులు… ఏడాదిలో 2 నుంచీ 6 వారాలు మాత్రమే పుష్పిస్తాయి. వాటి నుంచీ వచ్చే తేనె అరుదైనది, ఖరీదైనది కూడా. మరి అంత రేటు ఎక్కువగా ఉండే తేనె వల్ల ప్రయోజనాలు ఆ రేంజ్‌లో ఉంటాయా… అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఈ మానుకా తేనె… మిగతా తేనెల కంటే… కాస్త చిక్కగా, బంగారం రంగులో ఉంటుంది.
మానుకా తేనె జార్లను యూనిక్ మానుకా ఫ్యాక్టర్ ( UMF – Unique Manuka Factor) తయారుచేస్తోంది. ఈ జార్లకు గ్రేడ్స్ ఇస్తోంది. 5+, 10+, 15+, 20+ వంటి గ్రేడ్లు ఉంటాయి
హై గ్రేడ్ ఉండే హనీ జార్స్‌లో వేసే తేనె…
అంత్యంత నాణ్యమైనది, ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో సహజసిద్ధమైన ఎంజైములు, అమైనా యాసిడ్లు ఉంటాయి. పైగా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఫలితంగా ఈ తేనె వాడితే… రకరకాల రోగాలు నయమవుతాయి. గొంతు గరగర, అజీర్తి వంటి సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలకు చెక్ పెట్టవచ్చు.
ఇంతకీ ఈ మానుకా హనీ ధర ఎంత ఉంటుందంటే… 250 గ్రాముల స్వచ్ఛమైన 100 శాతం శుద్ధమైన మానుకా తేనె బాటిల్ రేటు రూ.4000కు పైనే ఉంటుంది. అంత రేటు ఉన్నా… చాలా మంది దీన్ని కొనుక్కుంటారు. ఎందుకంటే… దీన్ని వాడితే… చాలా రోగాలు రాకుండా ఉంటాయన్న నమ్మకమే. ఐతే… మన దేశంలో చాలా రకాల తేనెలు… ఈ మానుకా హనీ ఇస్తున్న ప్రయోజనాల్ని ఇస్తున్నాయి. ఎందుకంటే… ఇండియాలో పువ్వుల్లో ఉండే తేనె కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటోంది. కాబట్టి ఎవరికి నచ్చిన తేనెను వారు కొనుక్కోవచ్చు.