గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ 446.52 కోట్లు వెచ్చించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. చార్టర్డ్ విమానాలతో కలిపి ఇంత మొత్తం ఖర్చయిందని లోక్‌సభలో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ ఓ ప్రశ్నకు బదులిస్తూ తెలిపారు. ఇక 2015-16లో రూ 121.85 కోట్లు, 2016-17లో రూ 78.52 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు. 2017-18లో ఈ వ్యయం రూ 99.90 కోట్లు కాగా, 2018-19లో రూ 100 కోట్లు, 2019-20లో రూ 46.43 కోట్లు ప్రధాని విదేశీ పర్యటనలకు ఖర్చయిందని మంత్రి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై భారీగా ఖర్చు పెడుతున్నారన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించడం గమనార్హం.
పర్యటనల కోసం ₹446కోట్లు ఖర్చు చేసిన మోడీ
Related tags :