*కోవిడ్-19 విజృంభిస్తున్న ఆర్ధిక ఆందోళన నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటు కోటకు నిర్ణయించడంతో దేశీయ రూపాయికి బలమొచ్చింది. క్రూడ్ ధరలు ఎగిసి పడటంతో మంగళవారం కీలకమైన 73 స్థాయికి క్షీణించిన కరెన్సీ 6నెలల కనిష్టానికి పడిపోయింది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచే ఊగిసలాటలో మొదలైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో సెన్సెక్స్ 760 పాయింట్లు, నిఫ్టీ 199 పాయింట్లు దిగజారడం గమనార్హం. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 214 పాయింట్లు నష్టపోయి.. 38,409 వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి.. 11,251 వద్ద ముగిసింది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.38 వద్ద కొనసాగుతోంది. నేడు దేశంలో కొత్తగా మరి కొందరు వైరస్ బాధితులను గుర్తించడంతో సర్వత్రా భయాలు నెలకొన్నాయి. ఈ భయాల కారణంగానే మార్కెట్లు క్రమంగా దిగజారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం దేశంలో ఇప్పటి వరకు 28 మందికి వైరస్ సోకినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
*సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. క్రిప్టోకరెన్సీలకు అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. క్రిప్టోకరెన్సీలతో లావాదేవీలు చేయరాదు అని భారతీయ బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. వర్చువల్ కరెన్సీ లేదా క్రిప్టోకరెన్సీగా పేరుగాంచిన బిట్‌కాయిన్ లావాదేవీలను నిలిపివేయాలంటూ 2018 ఏప్రిల్‌లో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ సర్క్యూలర్‌ను సవాల్ చేస్తూ ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇవాళ సుప్రీంను ఆశ్రయించింది. రోహిటన్ నారీమన్, రవీంద్ర భట్, సుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఆ సర్క్యూలర్‌ను కొట్టి వేస్తూ తీర్పును ఇచ్చింది. ట్రేడింగ్‌లో క్రిప్టోలను ఆర్బీఐ నిషేధించడాన్ని కోర్టు తప్పుపట్టింది. వాస్తవానికి క్రిప్టో ట్రేడింగ్‌ను ఆర్బీఐ ఆపలేదు. కేవలం బ్యాంకులకు మాత్రం గతంలో ఆర్బీఐ తన ఆదేశాలను జారీ చేసింది.
*రిలయన్స్ కమ్యునికేషన్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్కాం రుణ దాతల కమిటీ లోనూ ఎస్బీఐ బోర్డు సానుకూలంగాఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
*దేశీయ స్టాక్ మార్కెట్లను కరోనా భయాలు కమ్మేశాయి. నేడు ఉదయం స్పల్పలాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నానికి భారీ నష్టాల్లోకి కుంగాయి. మధ్యాహ్నం 1.44 గంటల సమయంలో 760 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 37,862 వద్దకు.. 199 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 11,104 వద్దకు చేరాయి. నేడు దేశంలో కొత్తగా మరిన్ని కరోనా వైరస్ బాధితులను గుర్తించడంతో ఈ వ్యాధి వ్యాప్తిపై సర్వత్రా భయాలు నెలకొన్నాయి. తాజాగా దేశంలో ఈ వ్యాధిబారిన పడినవారి సంఖ్య ఒక్కసారిగా 28కి పెరిగింది. వీరిలో అత్యధికులు ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకులు. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాల్లో కొంత ఊగిసలాట ధోరణి కనిపించినా.. మెటల్, మీడియా, బ్యాంకింగ్, రియాల్టీ సూచీలు భారీగా పడిపోయాయి. దీంతోపాటు నేడు ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఇండియా, అమెరికాలోని సర్వీసుల పీఎంఐ డేటా రానుండటం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
ప్రపంచ మార్కెట్లలో మదుపరుల సెంటిమెంట్ కూడా ప్రతికూలంగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం కూడా కనిపిస్తోంది. దీనికి తోడు విదేశీ ఫండ్లు బయటకు వెళ్లడం కూడా అమ్మకాల ఒత్తిడిని పెంచుతోంది. చైనాతో సమానంగా భారత్‌లో జనాభా ఉండటం.. చైనా కంటే సాంకేతికంగా.. ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో ఇక్కడ కరోనా వ్యాపిస్తే కష్టమనే భయాలు ఎక్కువగా ఉన్నాయి.
*సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలు, స్పెక్ట్రమ్ వినియోగ రుసుములకు సంబంధించి టెలికాం సంస్థలు టెలికాం విభాగాని (డాట్)కి మరో విడతగా నిధులు జమచేశాయి. స్పెక్ట్రమ్ వినియోగ రుసుము కింద వొడాఫోన్ ఐడియా (రూ.3043 కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ.1950 కోట్లు), రిలయన్స్ జియో (రూ.1053 కోట్లు) కలిపి రూ.6,000 కోట్లు జమచేశాయి. స్పెక్ట్రమ్ వినియోగ రుసుము కింద చివరి విడతగా ఇప్పుడు టెలికాం సంస్థలు ఈ నిధులు చెల్లించాయి.
*2019 చివరి మూడు నెలల్లో దక్షిణాఫ్రికా ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు ఆ దేశ గణాంకాల బ్యూరో వెల్లడించింది. 1994లో వర్ణ వివక్ష ముగిసిన తర్వాత దేశాన్ని తాకిన మూడో మాంద్యం ఇదని తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019 చివరి మూడు నెలల్లో 1.4 శాతం క్షీణించింది. అంత క్రితం త్రైమాసికంలో ఇది 0.8 శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. మొత్తం మీద చూస్తే, 2019లో వృద్ధి కేవలం 0.2 శాతమే నమోదైంది. 2009లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదవడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.
*కరోనా (కొవిడ్-19) వ్యాప్తితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేందుకు వీలుగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లలో అర శాతం కోత విధించింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫెడరల్ ఫండ్స్పై ప్రస్తుత వడ్డీ రేట్ల లక్ష్యిత శ్రేణి 1.0-1.25 శాతానికి చేరింది. గత ఏడాది నుంచి చూసుకుంటే ఫెడ్ తొలిసారిగా వడ్డీ రేట్లను తగ్గించింది. అంతే కాకుండా విధాన సమావేశాల మధ్యలో కీలక రేట్లలో కోత విధించడం కూడా 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ ఇదే కావడం గమనార్హం.
*సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలు, స్పెక్ట్రమ్ వినియోగ రుసుములకు సంబంధించి టెలికాం సంస్థలు టెలికాం విభాగాని (డాట్)కి మరో విడతగా నిధులు జమచేశాయి. స్పెక్ట్రమ్ వినియోగ రుసుము కింద వొడాఫోన్ ఐడియా (రూ.3043 కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ.1950 కోట్లు), రిలయన్స్ జియో (రూ.1053 కోట్లు) కలిపి రూ.6,000 కోట్లు జమచేశాయి. స్పెక్ట్రమ్ వినియోగ రుసుము కింద చివరి విడతగా ఇప్పుడు టెలికాం సంస్థలు ఈ నిధులు చెల్లించాయి.
*కరోనా వైరస్ కారణంగా భారత ప్రభుత్వం 26 ఔషధాలు, ఔషధ ముడిపదార్థాల(ఇంగ్రేడియంట్ల) ఎగుమతులపై ఆంక్షలు విధించింది. వీటి కొరత రాకుండా చూడడం కోసం ఈ జాగ్రత్తలను పాటిస్తోంది. కాగా, ఆంక్షలు విధించిన వాటిలో పారాసిటమాల్, విటమిన్ బి1, విటమిన్ బి12 ఇంగ్రేడియంట్లు ఉన్నాయి. దీంతో ఈ యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్లు(ఏపీఐలు), ఫార్ములేషన్ల ఎగుమతులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) నుంచి లైసెన్సులు అవసరమవుతాయి. అంతక్రితం ఈ ఉత్పత్తులు ఎగుమతులపై ఎటువంటి ఆంక్షలూ లేవు.
ఆరు నెలల కనిష్టానికి డాలర్-వాణిజ్యం
Related tags :