Agriculture

రైతుల మోటార్లు సెల్‌ఫోన్‌తో నియంత్రించవచ్చు

kissan raja motor controller using smartphone

వ్యసాయంలో రైతులు అనేక సమస్యలు ఎదర్కొంటారు. వాటిలో అనేక అంశాలు ఉంటా యి. ముఖ్యంగా మోటరు పంపు నిర్వహణ, నియంత్రణ అనేవి కీలకం. రైతులు ఈ సమస్యలను అధిగమించడానికి కిసాన్ రాజ్ వారు స్మార్ట్ ఫోన్ ద్వారా మోటార్ పంపును ఆపరేట్ చేసే టెక్నాలజీని రూపొందించారు. ఆరువేల రూపాయలతో ఈ టెక్నాలజీని వినియోగించుకుని రైతులు అనేక ప్రయోజనాలను పొందవచ్చు అని కిసాన్‌రాజ్ ప్రతినిధులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9972336726, 9000829845 ఈ నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

*** నీటిపారుదలలో కీలక అంశాలు
మోటారు పంపుల పూర్తి సద్వినియోగం, నియంత్రణ, పర్యవేక్షణ అవసరం.
1) దూరప్రయాణాలు
2) నీటి పంపులపై మానవ వనరుల నియంత్రణ, పర్యవేక్షణ,
3) విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా పంపు లేదా స్టార్టర్ చెడిపోతాయి.
4) ఆటోమెటిక్ స్విచ్‌ల కారణంగా నీళ్లు వృథా, విద్యుత్ వృథా అవుతున్నాయి.
5) భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి.

*** నిరంతర విద్యుత్ ప్రభావం
1) రాష్ట్రంలో సుమారు 23లక్షల పంపుసెట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికం 5హెచ్‌పీ పంపుసెట్లే. ఒక 5హెచ్‌పీ పంపుసెట్టుకు గంటకు 3.75 విద్యుత్ అవసరం. ఒక యూనిట్ సగటు ఖర్చు రూ 3.05. ఒక 5హెచ్‌పీ పంపు ఒక గంటకు దాదాపు 25000 నీటిని తోడుతుంది. దీనివల్ల చాలా నీళ్లు, విద్యుత్ వృథా అవుతున్నది.
కిసాన్ రాజా టెక్నాలజీ లక్షణాలు
పంపుల సంఖ్య సంక్షిప్త సందేశం ద్వారా పర్యవేక్షణ నియంత్రణ మిస్స్‌డ్ కాల్ ద్వారా నియంత్రణ ఐవీఆర్‌ఎస్ నియంత్రణ, పర్యవేక్షణ పంపు ఆన్, ఆఫ్ కోసం ఈ పరికరంలో టైమర్ ఉంటుంది. నీటిని తోడే సమాచారం, ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తి పంపు నడువకుంటే మొబైల్‌కు సమాచారం వస్తుంది.

*** పరిష్కారాలు..
నీటి పంపులపై నియంత్రణలో స్మార్ట్ మొబైల్ నీటిపారుదలకు కిసాన్ రాజా అత్యాధునిక ఉత్పత్తులు.
1)ఎక్కడి నుంచి అయినా నీటి పంపును నియంత్రించుకోవచ్చు.
2) పూర్తి భద్రత, రక్షణ ఉంటుంది.
3) పూర్తి నమ్మకం.

*** కిసాన్ రాజా ఉత్పత్తులతో రైతులకు కలిగే ప్రయోజనాలు
-రైతు పొలం దగ్గర లేకున్నా నీటి పంపును ఆపరేట్ చేయవచ్చు. పంట వివిధ దశల్లో దానికి అవసరమైన నీటి గురించి రైతు మొబైల్‌కు సంక్షిప్త సమాచారం అందిస్తుంది.
-ఈ టెక్నాలజీ ద్వారా నీళ్లను, విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చు. నిర్వహణ ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు.
-సమయానుకూలంగా నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం వల్ల పంట ఉత్పత్తులు పెరుగుతాయి.
-అలాగే ఆటోమెటిక్ స్విచ్‌ల కారణంగా ఏర్పడే విద్యుత్, నీటి వృథాలను అరికట్టవచ్చు.
-తక్కువ ఎక్కువ విద్యుత్ సరఫరాల కారణంగా మోటా రు పంపులు చెడిపోకుండా నియంత్రివచ్చు.
-ఈ మొబైల్ టెక్నాలజీని రైతులు ఉపయోగించుకుంటే పాము కాట్లు, జంతువుల దాడులు, విద్యుత్ షాక్ లాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చుని తెలిపారు.