నగల్లో సరికొత్త ట్రెండ్లు నిరంతరం పుడుతూనే ఉంటాయి.. వాటి ఆదరణ కూడా అలాగే సాగుతూ ఉంటుంది. అలా చెప్పుకోదగిన జ్యువెలరీ ట్రెండ్…‘లేయర్ జ్యువెలరీ’! ఈ తరహా స్టయిల్‌లో నెక్లెస్‌లు, మొదలుకుని ఉంగరాల వరకూ ఉన్నాయి.
**లేయర్ నెక్లెస్:
వేర్వేరు పొడవులతో ఉన్న గొలుసులను ఒక దాని కింద ఒకటిగా అమర్చి తయారుచేసే ఈ రకం నెక్లెస్ మెడలో నిండుగా కనిపిస్తుంది. సన్నటి చెయిన్లే అయినా ఐదు లేదా ఆరు ఉండటం వల్ల భారీ లుక్ కూడా వస్తుంది. నాలుగు వరుసలను కలుపుతూ ఓ వైపు పెద్ద పెండెంట్ ఉన్నవి సరికొత్త ఫ్యాషన్. వేడుకల్లో ఈ రకం నగ పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు రెండింటికీ నప్పుతుంది.
**లేయర్ బ్యాంగిల్స్:
ఇది కూడా కొత్త ట్రెండే! పెద్ద సైజు మొదలుకుని చిన్న సైజు వరకూ మోచేతి దిగువ నుంచి ముంజేతి వరకూ ధరిస్తే… దాన్నే లేయర్ బ్యాంగిల్ స్టయిల్ అంటారు. ఇందుకోసం పెద్దవి కాకుండా మధ్యస్తంగా ఉండే గాజులు ఎంచుకోవాలి. అన్ని గాజులూ ఒకే రకంగా ఉండాలి. రాళ్లు పొదిగినవైతే అన్నీ అవే ఉండాలి. సాదా గాజులైనా అన్నీ అవే గాజులుండాలి. లేయర్ బ్యాంగిల్స్ టీనేజీ అమ్మాయిలకు చక్కగా నప్పుతాయి.
***లేయర్ బ్రేస్‌లెట్స్:
గాజులు వేసుకోవటానికి ఇష్టపడని వాళ్ల కోసమే ఈ స్టయిల్. ఫ్యాన్సీ డ్రెస్సులను ఇష్టంగా ధరించే అమ్మాయిలకు లేయర్ బ్రేస్‌లెట్లు బాగా సూటవుతాయు. ఒకే చేతికి వేసుకునే ఈ బ్రేస్‌లెట్లు మోకాళ్ల వరకూ ఉండే స్కర్ట్‌లు, మినీలు వేసుకునే వాళ్లకు సూటవుతాయి.
**లేయర్ రింగ్స్:
వేలి ఉంగరాలు నాలుగైదు కలిపి పెట్టుకుంటే చేతికే అందమొస్తుంది. ఒకే ఒక భారీ ఉంగరం బదులు ఇలా సైజులవారీగా ఉంగరాలు ధరించటం లేటెస్ట్ ఫ్యాషన్. ఆధునికం లేదా సాంప్రదాయం….ఎలాంటి వస్త్రధారణకైనా ఈ రకం ఉంగరాల స్టయిల్ బాగుంటుంది. కొన్ని సాదా, మరికొన్ని రాళ్లు పొదిగినవి…ఇలా ప్రయోగాలు చేసి నప్పిన ఉంగరాలను లేయర్లుగా ధరించాలి.
లేయర్ ధగధగలు
Related tags :