కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
తాజాగా న్యూ రోషెల్‌లో కరోనా వైరస్‌కు సంబంధించి 23 కొత్త కేసులు నమోదయ్యాయి.
అలాగే వెస్ట్‌చెస్టర్ కౌంటీలో వైరస్ సోకిన వారి సంఖ్య 57కు పెరిగింది.
‘ప్రావిన్స్‌లో కరోనా కేసులు 76కి పెరిగాయని, గత కొన్ని రోజులుగా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని గవర్నర్ క్యూమో తెలియజేశారు.
అలాగే రాక్‌అవే, సార్టోగా కౌంటీలలో కూడా కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు.
కాగా కరోనా వైరస్ సుమారు 70 దేశాలను వణికిస్తోంది.
కరోనా వైరస్ కారణంగా అమెరికాలో మరణించిన వారి సంఖ్య 19కి చేరుకుంది.
ఈ పరిస్థితి గురించి సమీక్షించిన న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో… న్యూయార్క్ నగరంలో కేసుల సంఖ్య రెట్టింపు అయిందని అన్నారు.
వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నందున స్థానిక ఆరోగ్యసంస్థలలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.
అందుకే అత్యవసర పరిస్థితి విధిస్తే, అత్యధిక సిబ్బందిని నియమించటానికి వీలు కలుగుతుందని ఆయన అన్నారు.