‘దేవుళ్లు’ ‘చిన్ని చిన్ని ఆశ’ ‘లిటిల్ హార్ట్స్’ వంటి సినిమాల్లో బాలనటిగా మెప్పించింది హైదరాబాదీ అమ్మాయి నిత్యాశెట్టి. ఆ తర్వాత కథానాయికగా అరంగేట్రం చేసి తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ఆమె కథానాయిక నటించిన తాజా చిత్రం ‘ఓ పిట్ట కథ’. చందు ముద్దు దర్శకుడు. ఆనందప్రసాద్ నిర్మాత. ఇటీవలే ప్రేక్షకులుముందుకొచ్చింది. ఈ సందర్భంగా నిత్యాశెట్టి మాట్లాడుతూ ‘తెలుగులో దాగుడుమూతల దండాకోర్, పడేశావే, నువ్వు తోపురా సినిమాల్లో నాయికగా నటించా. ‘ఓ పిట్ట కథ’ చిత్రంలో నేను పోషించిన వెంకటలక్ష్మి పాత్రకు మంచి స్పందన లభిస్తున్నది. ఆ పాత్రలో నేను చేసిన అల్లరి అందరిని నవ్విస్తోంది. బాలనటిగా సినిమాలు చేసినప్పుడు ఎలాంటి భయం ఉండేది కాదు. పిల్ల ముద్దుగా ఉందంటూ గారాబం చేసేవారు. ఇప్పుడు నాయికగా చాలా విషయాలపై శ్రద్ధ పెట్టాలి. నేను ఎంచుకునే సినిమాల్లో కథానాయిక అని కాకుండా కథలో నా పాత్రకున్న ప్రాధాన్యత గురించే ఆలోచిస్తా. ‘ఓ పిట్టకథ’ గత చిత్రాలకు భిన్నంగా నన్ను కొత్తకోణంలో ఆవిష్కరించింది. గ్లామర్ పాత్రలు ఇప్పటివరకు చేయలేదు. ఒకవేళ అవసరమైతే కథానుగుణంగా పరిధుల మేరకు గ్లామర్ పాత్రల్లో నటించాలని ఉంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. తెలుగులో కొన్ని ప్రాజెక్ట్లు చర్చల దశలో ఉన్నాయి’ అని చెప్పింది.
హీరోయిన్ అయింది
Related tags :