Food

వాల్‌నట్స్ తింటే మతిమరుపుకి వాల్ కట్టినట్లే

వాల్‌నట్స్ తింటే మతిమరుపుకి వాల్ కట్టినట్లే-Walnuts Kick Alzheimers Ass To The Dump-Telugu Food & Diet News

గుమ్మడికాయ గింజల్లో జింక్‌ ఉంటుంది. వీటిని తినడం ద్వారా మెదడు చురుగ్గా తయారవుతుంది. వాల్‌నట్స్‌లోని ఫోలిఫినాల్స్‌ జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. రోజూ వాల్‌నట్స్‌ తినడం వల్ల 19 శాతం జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుంది. ఇలాంటివారు సిట్రస్‌ జాతి పండ్లు తింటే మంచిది. మెదడు శక్తిని పెంచడానికి బ్లాక్‌ క్రాంట్లు, చేపలు, ఆకుకూరలు, పుట్టగొడుగులు, వేరుశనగ, నువ్వులు, గుడ్లు తరచూ ఆహారంలో ఉండేలా చేసుకోవాలి.యాంటీ ఆక్సిడెంట్లు బ్లూబెర్రీస్‌లో పుష్కలంగా ఉంటాయి. రోజూ బ్లూబెర్రీస్‌ తినడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఉంటుంది. ఆకుకూరల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. బ్రోకలీ, కాలే, కొల్లార్డ్‌ గ్రీన్స్‌, బచ్చలి వంటివీ రోజూ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.తృణధాన్యాల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. తరచూ తృణధాన్యాల్ని ఆహారంగా తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెదడును చురుగ్గా ఉంచడంలో సాయపడతాయి. వీటిని రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.