Movies

దుస్తులకు విలువ ఇస్తాను

Anupama Parameswaran Speaks On Her Costume Fashion & Tradition

నవతరం ఆలోచనల్లో ఆధునికత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. సంస్కృతిని… సంప్రదాయాల్ని పట్టించుకునే తీరికే లేదన్నట్టుగా పరుగులు తీస్తుంటారు. కానీ నేను అలా కాదంటోంది అనుపమ పరమేశ్వరన్‌. ధరించే దుస్తులు మొదలుకొని… ఇంట్లో పాటించే పద్ధతుల వరకు అన్నింటికీ విలువిస్తానని చెబుతోంది. ‘‘నేనూ నవతరం అమ్మాయినే. వృత్తిలో భాగంగా ఎంతోమందిని కలుస్తున్నా. సినిమాల్లో చేస్తున్న పాత్రల కారణంగా కొత్త జీవితాల్లోకీ తొంగి చూస్తున్నా. కానీ ఎప్పుడూ నా వ్యక్తిగత జీవన శైలి మారలేదు. నాయిక కాకముందు ఎలా ఉండేదో ఇప్పుడూ అంతే. మన ఇళ్లల్లో పాటించే కొన్ని పద్ధతులు, నమ్మకాలు మంచివే. పెద్దవాళ్లు ఏవీ ఊరికే చెప్పరు. అవి క్రమశిక్షణతో కూడిన జీవితానికి దోహదం చేస్తాయి. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా చిత్రీకరణల్లో ఉన్నా కొన్ని నమ్మకాల్ని పాటిస్తా’’ని అంది అనుపమ.