‘‘నేనిప్పుడు కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నాను. దాన్ని ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను’’ అంటోంది కృతి సనన్. ఆమె మహేష్‌బాబుతో కలసి నటించిన ‘నేనొక్కడినే’తో వెండితెరపై అడుగుపెట్టింది. టైగర్ ష్రాఫ్‌తో నటించిన ‘హీరో పంటి’తో బాలీవుడ్‌కూ పరిచయమైంది. ఆ తర్వాత అక్కడ మంచి అవకాశాలు అందుకుంది. 2019లో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. ఆ ఏడాది కార్తిక్ఆర్యన్తో ‘లుకా చుప్పి’, అక్షయ్ కుమార్‌తో ‘హౌస్‌ఫుల్ 4’లో నటించి విజయాలందుకుంది. ‘బచ్చన్ పాండే’లో అక్షయ్‌కు మరోసారి జోడీగా కనిపించనుంది. రాజ్‌కుమార్ రావ్‌తో కలసి ఓ హాస్య నేపథ్య చిత్రంతో అలరించనుంది. ‘‘నా కెరీర్‌ను ఎంతో ఆస్వాదిస్తున్నాను. ఏడాదికి ఒక్క చిత్రంలోనైనా ఇప్పటి వరకూ చేయని పాత్రలో కనిపించాలన్నది నా కోరిక. ‘హౌస్‌ఫుల్ 4’తో తొలిసారి పునర్జన్మల నేపథ్యంలో వినోదం పండించే పాత్ర చేశాను. ‘పానిపట్’తో చారిత్రక నేపథ్య పాత్రలో కనిపించాను. ‘బచ్చన్ పాండే’లోనూ విభిన్న పాత్ర చేస్తున్నాను. ‘మిమి’లో సరొగేట్ మదర్‌గా కనిపిస్తాను. నేను చేసిన పాత్రలను తిరిగి చూసుకుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది’’ అని చెప్పింది కృతి.
ఏడాదికి ఒక్కసారి
Related tags :