Sports

ఒలంపిక్స్ అర్హత సాధించిన మేరీ

Mary Kom Qualifies To 2020 Olympics

భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్‌ (51 కేజీల విభాగం) ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో సెమీస్‌కు చేరడంతో ఆమెకు టోక్యో బెర్తు ఖాయమైంది. సోమవారం జరిగిన పోరులో రెండో సీడ్‌ మేరీ కోమ్‌ ఫిలిప్పీన్స్‌ క్రీడాకారిణి ఐరిష్‌ మాగ్నోపై 5-0 తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో చైనాకు చెందిన యూన్‌ చాంగ్‌తో ఆమె తలపడనుంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్‌ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Image result for mary kom 2020 olympics