DailyDose

వివేకా కేసు సీబీఐకి అప్పగించిన హైకోర్టు-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-AP High Court Transfers VIveka Murder Case To CBI

* వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని సీబీఐకి అప్పగించిన హైకోర్టు.

* హిమా చల్‌ ప్రదేశ్‌లో ఒక బస్సు ప్రమాదవ శాత్తు లోయలో పడిన ఘటనలో ఐదుగురు మరణిం చగా, 35 మందికి గాయా లయ్యాయి. మంగళవారం ఉదయం 6.45 గంటలకు చంబా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగి నట్లు పోలీసులు తెలిపారు. డెహ్రాడూన్‌ నుండి చంబా వెళుతున్న ప్రభుత్వ బస్సు అదుపుతప్పి లోయలో పడిందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

* మాచర్ల లో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ నేతలను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు. బుద్ధా వెంకన్న , బోండా ఉమ కార్లపై దాడి. నిన్న వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ నేతల్ని పరామర్శిందనికి వెళ్లిని బుద్ధ , బోండా.

* టీడీపీ నేతలపై వైసీపీ దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి. గుంటూరు జిల్లాలోని మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్న, హైకోర్టు న్యాయవాది కిశోర్‌లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలే టీడీపీ నేతల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. భయానక వాతావరణంతో రెండు వాహనాల్లో ఉన్న టీడీపీ నేతలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. లాయర్ కిశోర్‌తో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కిశోర్ మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలకు న్యాయపర సలహా ఇవ్వడానికి తాము మాచర్ల వెళ్లామని.. తన వెనక కార్లో బొండా ఉమా, బుద్దా వెంకన్న ఉన్నారని చెప్పారు. అక్కడున్న వైసీపీ కార్యకర్తలు తమ వాహనాలపై దాడి చేశారన్నారు. తనకు గాయమైందని, రక్తమోడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. అక్కడి నుంచి నల్లగొండకు వెళ్లినట్టు తెలిపారు. నాగార్జున సాగర్ మీదుగా.. నల్లగొండ చేరుకున్నామని చెప్పారు. 10 బళ్లపై ఇంకా తమను వెంబడిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆలియా, మల్లేపల్లి .. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాలని కిశోర్‌కు చంద్రబాబు సూచించారు. వారి సహాయం తీసుకోవాలని తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ గారి ఆదేశాల ప్రభుత్వం నూతనం గా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల మెరుపు దాడులు. పోలీస్, ఎక్సైజ్ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై ఉదయం 4 గంటల నుండి కొనసాగుతున్న దాడులు.

* హయత్‌నగర్‌లో ఇద్దరి మధ్య జరిగిన చిన్న వివాదం ప్రాణం తీసే వరకూ వెళ్లింది. కారును బైకు ఢీకొట్టడంతో ఘర్షణ తలెత్తింది. కారులో ఉన్న ప్రసాద్‌, సతీష్‌కు నచ్చజెప్పేందుకు పరమేశ్వర్‌, రాజు యత్నించారు. ఆగ్రహంతో పరమేశ్వర్‌, రాజును ప్రసాద్, సతీష్‌ కారులో తీసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లగానే కారు బోల్తా పడింది. ఈ నేపథ్యంలో పరమేశ్వర్‌ మృతి చెందగా. రాజు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో నిందితులిద్దరూ కారు వదిలి పరారయ్యారు.

* మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో కొంత కాలంగా జరుగుతోన్న  వ్యభిచారం గుట్టురట్టయింది. మంగళగిరి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్‌కమల్‌ రోడ్డులో ఇద్దరు మహిళలు  కొంత కాలంగా ఓ ఇల్లును అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.  ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి    వ్యభిచారం నడుపుతున్నారనే పక్కా సమాచారం అందుకున్న  మంగళగిరి రూరల్‌ సీఐ పి.శేషగిరిరావు,  ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో  మెరుపుదాడి నిర్వహించారు. 

* రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లి వద్ద అర్థరాత్రి ట్రాన్స్ జెండర్‌లు హల్‌చల్ చేశారు. స్థానికులకు. ట్రాన్స్ జెండర్‌లకు మధ్య వాగ్వివాదం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్న యువకులను ట్రాన్స్‌జెండర్‌లు తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాయి. మరోసారి ఆ ప్రాంతానికి రాబోమని ట్రాన్స్ జెండర్‌లు రాసి ఇచ్చారు. నేషనల్ హైవే గగన్‌పహాడ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిత్యం అర్థరాత్రి హిజ్రాల ఆగడాలు చోటు చేసుకుంటున్నాయి. యువకులను మోసగించి హిజ్రాలు డబ్బులు వసూలు చేస్తున్నారు.  అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు.

* కాచిగూడ పోలీస్ స్టేషన్‌ పరిధిలో, గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటో చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జిపైకి రాగానే. మూడు సార్లు పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మద్యం మత్తులో ఆటో డ్రైవర్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ నెల 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేస్తారనే ప్రచారం నేపథ్యంలో జిల్లాలో మద్యం ప్రియులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. వచ్చే 17 రోజుల పాటు తమ మద్యం అవసరాలకు అనుగుణంగా ముందస్తుగా పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం కనిపించింది. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మద్యం దుకాణాల వద్ద రద్దీ చోటుచేసుకుంది. ఒకరికి మూడు సీసాలు వరకు విక్రయించే అవకాశం ఉండడంతో ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోగా, తమ సహచరులు, స్నేహితులు, బంధువులను సైతం వరుసల్లో నిలుచోబెట్టి మరీ కొనుగోలు చేయడం గమనార్హం. ఒకేరోజు పెద్దసంఖ్యలో జనం దుకాణాల వద్దకు వచ్చేసరికి, వాటికి ఆ రోజుకు సరఫరా చేసిన మద్యం సాయంత్రానికే అమ్ముడైపోయి చాలావరకు మూతపడిపోవడం గమనార్హం.

* కంచికచర్ల లో నివాసం ఉంటూ. వీరులపాడు మండలం జూజ్జురు లో జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న, నాగమణి అనుమానాస్పద రీతిలో మృతి. తన నివాసంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని మృతి చెందినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రక్కన పెట్రోల్ బాటిల్ ఉండడం మహిళ దగ్ధమై ఉండటం. పలు అనుమానాలకు తావిస్తున్నాయి. మహిళలకు వివాహమైన ఇంటిలో ఒక్కరే ఉండడం తో, ఈ మృతుకి కుటుంబ పరమైన కారణాల, మరే విధమైన కారణాలు తెలియరాలేదు. కూతురు బందరు ఆంధ్ర బ్యాంకు లో ఉద్యోగం చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* సత్తుపల్లి పట్టణంలో అనుమానాస్పదం మహిళ మృతి. సత్తుపల్లి మండలం కాకర్ల పల్లి గ్రామానికి చెందిన వాణి 24 (సం) ల వివాహిత మృతి చెందడం జరిగింది.

* మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

* ప.గో…..నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో కుటుంబ కలహాలు నేపథ్యంలో చాపల గంగా బాలాజీ (30 ) పురుగుల మందు త్రాగి ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమిశ్రగూడెం పోలీసులు.

* బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగింది. శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మాచర్ల దాడి ఘటనపై ఏపీ డీజీపీ, ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై హత్యాయత్నం జరిగిందని, శాంతిభద్రతలు సరిగా లేనందువల్లే ఈ ఘటన జరిగిందని, పోలీసుల్లో ఒక వర్గం ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వైసీపీ దాడుల నియంత్రణకు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు తగిన భద్రత కల్పించాలని కోరారు.

* శంకర పల్లి కానొజి గూడ వద్ద కేటీఆర్ ఫామ్ హౌజ్ పై డ్రోన్ కెమెరా వాదరన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నా రేవంత్ రెడ్డి