Food

పెరుగు క్రమం తప్పకుండా తినాలి

Eat Yogurt Everyday Without Fail-Telugu Food And Diet News

అందంగా, ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ, దీనికి ఏం చేయాలో మాత్రం తెలియదు. అలాంటివారు ఆహారంలో కొన్నింటిని భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, దీంతో ఆటోమేటిగ్గా అందంగా కూడా మారతం. మరి ఆ ఫుడ్ ఐటెమ్స్ ఏంటో తెలుసుకోండి.ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వీటితోపాటు సరైన ఆహారం తీసుకుంటే 90 శాతం అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, మనం మాత్రం నచ్చినవి మాత్రమే తింటుంటాం. సాధారణంగా మనకు నచ్చే ఆహారపదార్థాలతో పాటు నచ్చినా.. నచ్చకపోయినా కొన్నిటిని కచ్చితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా, అందంగా కూడా ఉండొచ్చు..మీ మార్నింగ్‌ని హెల్దీగా స్టార్ట్ చేయాలనుకుంటే.. ఓ గ్లాసు నీటిలో నిమ్మకాయ రసం వేసుకొని తాగడం. ఇలా నీరు త్రాగటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్‌గా, మెరుస్తూ ఉండేలా సాయపడుతుంది. కూల్‌ డ్రింక్స్ తాగడం మానేసి తాజా పండ్ల రసాలను తాగండి . సమ్మర్‌లో, వేడి వేడి టీకి బదులుగా, నిమ్మకాయ ఐస్‌ టీ, జీరా నీరు, లస్సీ, మజ్జిగ త్రాగండి. చక్కెరతో నిండిన డెజర్ట్‌లకు బదులుగా పెరుగులో తేనే కలిపి తీసుకోండి. అదేవిధంగా తాజా పండ్లు తీసుకోండి.ప్రస్తుతం కాలుష్యం, జంక్ ఫుడ్ అలవాట్లతో ఆరోగ్యం మాత్రమే కాదు. చర్మ సౌందర్యాన్ని కోల్పోతున్నాం. అయితే అది ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి ఆహార అలవాట్లు స్కిన్‌కి మంచివి కాదు. దీని వల్ల చర్మం యవ్వనతత్వాన్ని, సహజత్వాన్ని కోల్పోతుంది. అయితే, అందమైన చర్మాన్ని పొందడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా మీ ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేస్తే మెరిసే యవ్వనమైన చర్మం మీ సొంతం అవుతుంది. అందుకోసం చాలా మంది సహజంగా దొరికే ఆహారానికి పెద్ద పీట వేస్తున్నారు. అయితే, ఇది కొత్తేమీ కాదు. భారతదేశంలో ఎప్పట్నుంచో కూడాసహజంగా దొరికే ఆహారానికి అధిక విలువ ఇస్తారు. అనగా పచ్చిగా తినగలిగేవి, శుద్ధి చేయనివి, ప్రాసెస్ చేయనివి. అవే తాజా పండ్లు, ముడి సలాడ్లు, మొలకెత్తిన తృణధాన్యాలు, పప్పులు, కాయలు , విత్తనాలు, పెరుగు ఇవన్నీ సహజ ఆహారాలే. ఇవి మన రోజువారీ డైట్‌లో ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి. శుద్ధి చేసిన చక్కెరలు, కొవ్వులను తగ్గించాలి.అందం అంటే కేవలం మేకప్ అనుకుంటారు. చర్మం నిర్జీవంగా ఉంటే బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఉపయోగిస్తాం కానీ, ఆహారంపై శ్రద్ధ చూపం … అందమైన మెరిసే చర్మానికి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చాలా ముఖ్యం. సహజమైన ఆహారం మీ చర్మాన్ని హైడ్రేట్‌గా, యవ్వనంగా ఉంచేందుకు హెల్ప్‌ చేస్తాయి. సహజమైన ఆహారాలు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సహజమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ చర్మం మెరుస్తూ, యవ్వనంగా ఉంటుంది. అందుకే, మీరు తినే, త్రాగే వాటి గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో కొవ్వులు, చక్కెర, మీట్ తీసుకోవడం తగ్గించండి. మీ రోజువారీ ఆహారంలో వీలైనంతవరకూ తాజా పండ్లు, కూరగాయలను తీసుకోండి. పెరుగు మీ చర్మానికి ఆరోగ్యకరమైన ఆహారం, స్కిమ్డ్ మిల్క్, పన్నీర్ ని కూడా మీ ఆహారంలో చేర్చవచ్చు. కూరగాయలను తేలికగా ఉడికించాలి. బచ్చలకూర, పాలకూర వంటి ఆకుకూరలు తినండి. అలానే పండ్లు, తాజ కూరగాయల రసాలు కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇవి మీ చర్మానికి మరింత సౌందర్యాన్ని ఇస్తాయి.శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆహారం మంచి ఆరోగ్యం, అందం రెండింటినీ అందిస్తుంది. సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోండి. సమ్మర్‌లో, మన శరీరంలో ద్రవాలు కోల్పోతాం. కాబట్టి పుచ్చకాయలు, దోసకాయ వంటి సమ్మర్ ఫ్రూట్స్‌ని తీసుకోండి. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. రోజు తగినంత నీరు, ద్రవాలు తీసుకోవడం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేసి, టాక్సిన్స్, వ్యర్ధాలను శుభ్రపరుస్తుంది. మరోవైపు, మన శరీరం నుండి వ్యర్ధాలు, విషాన్ని సక్రమంగా తొలగించక పొతే అది చర్మానికి హాని చేస్తుంది. దీని వల్ల చర్మం నిర్జీవంగా కనపడుతుంది. మీ ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నీరు తక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నీటిని కోల్పోయి దాని యవ్వన నాణ్యతను కోల్పోతుంది.చర్మం నిర్జీవంగా, సహజత్వాన్ని కోల్పోతే వాటిని మేకప్‌ తో దాచడం అనేది అంత మంచిది కాదు. ముందుగా చర్మ సమస్యలను తగ్గించుకోవాలి. ఆయుర్వేదంలో మన ఆహారంలో తాజా సేంద్రీయ, పోషక ఆహారాన్ని చేర్చాలని చెబుతారు. ఎందుకంటే, అవి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, మన చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. అందం అనేది మీరు ఎలా కనిపిస్తారనేది మాత్రమే కాదు.. లోపలి నుంచి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారని కూడా.. కాబట్టి కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని అందంగా మారండి.

Image result for yogurt everyday