1. ఇప్పటి వరకు కరోనా వైరస్ 127 దేశాలకు విస్తరించింది.
ప్రపంచ వ్యాప్తంగా లక్షా 34 వేల717 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా 4,979 మంది మృతి చెందారు. చైనాలో 3,176కి కరోనా మృతులు సంఖ్య చేరుకుంది. ఇటలీలో 1,016కి మృతుల సంఖ్య చేరుకుంది. ఇరాన్‌లో 429 మంది మృతి చెందారు. దక్షిణ కొరియాలో 67 మంది, స్పెయిన్‌లో 86 మంది, ప్రాన్స్‌లో 61 మంది, అమెరికాలో 41 మంది మృతి చెందారు. కెనడియన్ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సతీమణికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనాపై సమాచారం కోసం హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ హెల్ప్‌లైన్ నంబర్ 104,ఆంధ్రప్రదేశ్ హెల్ప్‌లైన్ నంబర్ 0866 2410978,
సెంట్రల్ హెల్ప్‌లైన్ నంబర్ 011 23978046,ను ఏర్పాటు చేశారు.
2.రాష్ట్రంలో తొలి కేసు
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా.. మన రాష్ట్రాన్నీ తాకింది. నెల్లూరులో తొట్టతొలి కేసు నమోదైంది. ఇటలీ నుంచి వారం రోజుల క్రితం వచ్చిన విద్యార్థికి కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. ఇతడి నమూనాలను తిరుపతి స్విమ్స్లో పరీక్షించినప్పుడు ప్రాథమికంగా పాజిటివ్గా వెల్లడైంది.మరోసారి నిర్ధారణ కోసం పుణె ఎన్ఐవీకి పంపగా అక్కడ కూడా నిర్ధారణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇటలీ నుంచి దిల్లీ విమానాశ్రయం మీదుగా చెన్నైకి వచ్చిన నెల్లూరు వాసి.. అక్కడినుంచి నెల్లూరుకు కారులో వచ్చాడు. దాంతో కుటుంబసభ్యులతో పాటు కారు డ్రైవరు (మొత్తం ఐదుగురు)కు కూడా వైద్య పరీక్షలు జరిపారు. వీరిని 14 రోజులపాటు ఇళ్లలో ఏకాంతంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతానికి వారిలో అనుమానించదగ్గ లక్షణాలు ఏమీ లేవని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి వెల్లడించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి.వారిని వైద్యులు ప్రత్యేక వార్డులలో ఉంచి.. నమూనాలను పరీక్షలకు పంపారు. కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో నెల్లూరు జిల్లాలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. సినిమా థియేటర్లలో ప్రదర్శనలను నిలిపివేశారు. విదేశాల నుంచి వచ్చినవారు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. నగరంలోని ఒక హోటల్లో 30 మంది పోర్చుగల్ దేశీయులు ఉన్నా.. వారికి వ్యాధి లక్షణాలు ఏమీ లేవని కలెక్టర్ తెలిపారు. ఆరు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసి, మూడు కంట్రోల్ రూముల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 500 మంది సిబ్బందిని వైద్యసేవల కోసం వినియోగిస్తుండగా.. మరికొందరికి అదనంగా విధులు కేటాయిస్తున్నారు. కరోనా కేసు నేపథ్యంలో నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కరోనా అవగాహన పత్రాలు ప్రదర్శిస్తున్నారు. అవసరమైన పరికరాలు, పారిశుద్ధ్య సామగ్రి అందుబాటులో ఉంచారు
3.కరోనా’ కట్టడిలో రువాండా ఆదర్శం
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం..? అలాగే ఉంది కరోనా బాధిత దేశాల పరిస్థితి. కరోనా వైరస్ను అడ్డుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం. ప్రస్తుత తరుణంలో ప్రపంచంలోని అగ్రదేశాలనే ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటి వరకూ దీనికి వ్యాక్సిన్ దొరక్కపోవడంతో ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. అయితే, ఇందుకు రువాండా మినహాయింపు. మధ్య ఆఫ్రికాలోని ఈ చిన్న దేశం ఈ విషయంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అందుకే ఇప్పటి వరకూ ఆ దేశంలోకి కరోనా ప్రవేశించలేకపోయింది. ఇందుకు ముఖ్య కారణం ఆ దేశ ప్రజలు అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే. ఇంతకీ వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా..?చేతులు శుభ్రం చేసుకోవడం
కరోనా వైరస్ను అడ్డుకోవడంలో మొదటి మెట్టు చేతులు శుభ్రం చేసుకోవడం. రువాండా దేశంలో ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే. అందుకోసం ప్రతి బస్టాపులోనూ ప్రత్యేకంగా పోర్టబుల్ వాష్ బేసిన్లు ఉంటాయి. చేతులు శుభ్రం చేస్తేనే బస్టాండులోకి ప్రవేశం సాధ్యం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదు.
*పరిశుభ్రతకు చట్టం
పరిశుభ్రత విషయంలో రువాండాకు ఘన చరిత్రే ఉంది. 1994లో భయంకరమైన మారణహోమంతో తీవ్రంగా దెబ్బ తిన్న ఆ దేశం.. క్రమేపీ అభివృద్ధి సాధిస్తూ వస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదికల ప్రకారం.. మధ్య ఆఫ్రికాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశాల్లో రువాండా ఒకటి. ప్రతి నెలా చివరి శనివారం రువాండా ప్రజలు ‘ఉముగాండా’ అనే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఆ రోజు అందరూ కలిసి వీధులు, ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రపరుస్తారు. అక్కడ ఇది చట్టం.
*ప్లాస్టిక్ నిషేధం
మన దగ్గర ఇప్పటికీ అమలుకు సాధ్యం కాని ప్లాస్టిక్ సంచుల నిషేధం అక్కడ దశాబ్ద కాలం నుంచే అమల్లో ఉంది. ఈ దేశంలో ఆఫ్రికాలోనే పరిశుభ్రతకు కేరాఫ్ అ్రడస్.
*(ర్యావరణ పరిరక్షణ
పర్యావరణ పరిరక్షణలోనూ రువాండ ఆదర్శంగా నిలుస్తోంది. వన్యప్రాణులు, ప్రకృతిని కాపాడేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోంది. అక్కడ నేరాల శాతం చాలా తక్కువ. ఆఫ్రికా ఖండంలో అత్యంత సురక్షితమైన దేశం రువాండా. ఇదిలా ఉండగా.. కరోనా భయంతో అగ్రదేశాలు సైతం విదేశీ పర్యాటకు రాకపై నిషేధం విధించాయి. కానీ, రువాండా మాత్రం పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటించడం గమనార్హం. పర్యాటకులకు సాధారణ సేవలు కొనసాగుతాయని పర్యాటక, అభివృద్ధి బోర్డు తెలిపింది.
4.కరోనాపై ప్రత్యేక హెల్ప్లైన్
మన దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటుచేసింది. వైరస్ సంబంధిత అంశాలపై 011-23978046లో సంప్రదించవచ్చునని ప్రజలకు సూచించింది. మరోవైపు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ‘104’ ఫోన్ నంబర్ను కరోనాపై హెల్ప్లైన్గా ఉపయోగించుకుంటున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
5. 125 దేశాల్లో కొవిడ్ కల్లోలం
కరోనావైరస్ ప్రపంచాన్ని కమ్మేసింది. ఇది ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు ప్రకటించిన వేళకు ఏకంగా 125 దేశాల్లో విలయతాండవం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం దాసోహమైంది.వాషింగ్టన్ డీసీ సహా 15 రాష్ట్రాల్లో ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించారు. పరిస్థితి చేజారడంతో 30 రోజుల పాటు తమ దేశానికి రావొద్దంటూ 26 ఐరోపా సమాజ దేశాలకు అధ్యక్షుడు ట్రంప్ బాంబు పేల్చారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఈయూ సరిగా స్పందించలేదని ఆయన తప్పుబట్టారు. స్వదేశాలకు వచ్చే అమెరికన్లకు ఈ బ్యాన్ వర్తించదని, వాణిజ్య కార్యకలాపాలు కూడా కొనసాగుతాయని చెప్పారు.ట్రంప్ కూడా కొలరాడో, నెవెడా, విస్కాన్సన్ల్లో ఎన్నికల సభలను రద్దు చేసుకున్నారు. వైరస్ దెబ్బకు ఘోరంగా పడిపోయిన ఆర్థికవ్యవస్థలను ట్రంప్ నిర్ణయం మరింత గాయపరుస్తుందని, మాంద్యం పెరిగేందుకు అవకాశం ఇస్తుందని, ఆర్థిక విధ్వంసం చోటుచేసుకుంటుందని ఈయూ దేశాలు మండిపడ్డాయి. ‘ఇది ప్రపంచ సంక్షో భం. ఈ సమయంలో కావల్సినది అన్ని దేశాల పరస్పర సహకారం. ఏకపక్ష నిర్ణయాలు కాదు’ అని యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ల అధ్యక్షులు విమర్శించారు.
*హాలీవుడ్ సూపర్స్టార్కు కరోనా
హాలీవుడ్ సూపర్స్టార్ టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా హాంక్స్కు కరోనా సోకింది. విఖ్యాత గాయకుడు ఎల్విస్ ప్రెస్లీపై వార్నర్ బ్రదర్స్ తీసే సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల నిమిత్తం ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నారు. తమకు నీరసం, చలిజ్వరం, ఒళ్ల నొప్పులు రావడంతో పరీక్ష చేయించుకున్నామని, కరోనా లక్షణాలున్నట్లు ధ్రువపడిందని టామ్ తన ఇన్స్టా ద్వారా తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి ఈ నెలలో జరపతలపెట్టిన మెరైన్ బయోడైవర్సిటీ, దేశీ య, స్థానికాంశాలు, మహిళా సమస్యలపై తలపెట్టి న సదస్సులను వాయిదా వేసుకుంది. అటు భద్రతా మండలి తన షెడ్యూల్ను కుదించుకుంది. డెలిగేట్ల సంఖ్యను భారీగా తగ్గించాలని సభ్య దేశాల ను కోరింది. సమావేశాలు విశాలమైన హాళ్లలో ఉండేట్లు చూడాలని నిర్ణయించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వార్షిక సమావేశాలను కరోనా కారణంగా రద్దు చేసింది.
*తీవ్ర దశను దాటేశాం : చైనా
చైనా దాదాపుగా తెరిపిన పడ్డట్లే కనిపిస్తోంది. హ్యూబై రాష్ట్రంలో గురువారం కొత్త కేసులు 8 మాత్ర మే నమోదయ్యాయి. డిసెంబరులో వైరస్ మొదలయ్యాక సింగిల్ డిజిట్లో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. అయితే వ్యాధి బారిన పడ్డ 4,257 పరిస్థితి విషమంగానే ఉంది. ‘వైరస్ అత్యధిక దశను దాటేశాం. ఆటో రంగంలో కీలకమైన వుహాన్లో కొన్ని పరిశ్రమలను తెరుస్తున్నాం’ అని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రతినిధి లీ ఫెంగ్ చెప్పారు.
*ఐఎంఎఫ్ సాయం కోరిన ఇరాన్
దేశమంతా వైరస్ విస్తరించి, వాణి జ్యం,ఎగుమతులు దెబ్బతినడంతో ఆర్థికసాయం అందించాలని ఐఎంఎఫ్ను ఇరాన్ అర్థించిం ది. ఇప్పటికే అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కాగా, పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో కేసుల సంఖ్య గురువారంనాడే 10 వేలకు పైగా నమోదయ్యాయి. వీటిలో ఇరాన్ పరిస్థితి మరీ గడ్డుగా ఉంది. మరణాల సంఖ్య429కు పెరిగింది.
*మోదీకి నెతన్యాహూ ఫోన్
వైరస్ త్వరగా వ్యాపిస్తుండడంతో వివిధ దేశాల సాయాన్ని ఇజ్రాయెల్ అర్థించింది. భారత ప్రధాని, నా స్నేహితుడు మోదీకి కూడా ఫోన్ చేసి పరిస్థితిని వివరించానని, సాయం కోరానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. కరోనా వైరస్ ఓ ఏడాదికాలం లేక అంతకంటే ఎక్కువే ఉంటుందని సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ అంచనా వేశా రు. ‘ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. రవాణా ఆంక్షలు విధించాం. అయితే ఎల్లకాలం ప్రపంచంతో సంబంధాలు లేకుండా గడపలేం’ అన్నారాయన. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం ఫ్లోరిడా రిసార్టులో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారోను కలి శారు. బోల్సనారోతో ఆయన సమాచార అధికారి ఫాబియో వజింగార్టెన్ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. స్వదేశం వెళ్లాక ఫాబియోకు వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.
*కెనడా ప్రధాని భార్యకు వైరస్
కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడోకు కరోనా సోకింది. దాంతో తామిద్దరం స్వయంగా ఏకాంతవాసంలో ఉండనున్నట్లు ట్రూడో ప్రకటించారు. ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.
*అరుణ గ్రహంపైకి మిషన్ వాయిదా
అంగారకుడిపై పరిశోధనలకు గాను రష్యా-ఐరోపా సమాజం సంయుక్తంగా పంపదలిచిన అంతరిక్ష నౌకను రెండేళ్ల పాటు వాయిదా వేశాయి. మార్స్పై జనజీవనానికి అవకాశం ఉందా లేదా అన్నది పరిశోధించడానికి ఓ రోబోను అక్కడ ప్రవేశపెట్టాలన్నది ఈ మిషన్ లక్ష్యం. కరోనా వైర్సని దృష్టిలో పెట్టుకుని, అన్నీఆ లోచించాక- ఈ ప్రయోగాన్ని 2022కు వాయిదావేశామని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్ అధ్యక్షుడు దిమిత్రి రోగోజిన్ చెప్పారు.
*మోదీకి బ్రిటన్ ప్రధాని ఫోన్
ప్రధాని నరేంద్ర మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం రాత్రి ఫోన్ చేసి వైరస్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, సహకారంపై చర్చించారు. బ్రిటన్ ఆరోగ్యమంత్రి నాడిన్ డోరీస్కు వైరస్ సోకడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
*ఎవరెస్ట్ మూసివేత
ఎవరెస్ట్ శిఖరాధిరోహణను చైనా మూసేసింది. ఈ శిఖరానికి నేపాల్ వైపు నుంచి అత్యధికంగా వెళ్తారు. చైనా ఉత్తర ప్రాంతం నుంచీ, టిబెట్ నుంచీ వెళ్లే వీలుంది. ఈ దారుల్లో వెళ్లేందుకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. బేస్ క్యాంప్ల్లో వైరస్ సోకే ప్రమాదం ఉండడం, చలి ప్రదేశాల్లో వైరస్ సోకేవారి పరిస్థితి తొందరగా విషమించే అవకాశం ఉండడం వల్ల అనుమతులు నిలిపేస్తున్నట్లు తెలిపారు. నేపాల్ మాత్రం యథావిధిగా కొనసాగించనుంది.
*అమెరికాలో నో షేక్హేండ్స్, నో కిసెస్
ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ అమెరికన్ రాజకీయవేత్తలు కరచాలనాలకు, ముద్దులకు దూరం పెట్టారు. కరోనా భయంతో ఒకర్నొకరు తాకడానికే ఇష్టపడడం లేదు. మరీ బావుండదని అనుకున్నారేమో… పిడికిళ్లు తాకించుకోవడం, భుజాలను పరస్పరం రాపాడించుకోవడం చేస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే తన ర్యాలీలను రద్దు చేసుకోగా, డెమొక్రటిక్ పార్టీ నేతలు బెర్నీ సాండర్స్, జో బిడెన్ మాత్రం కొనసాగిస్తున్నారు.
*అమెజాన్, ట్విటర్ ప్రత్యేక చర్యలు
వర్క్ ఫ్రం హోం చేయాల్సిందిగా సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులను కోరింది. అటు డెలివరీ దిగ్గజం అమెజాన్- తన ఉద్యోగులకు పెయిడ్ సిక్లీవు మంజూరు చేసి- ఇళ్ల దగ్గరే ఉండిపోవాలని కోరుతోంది.
6. కరోనా ఎఫెక్ట్: ఐపీఎల్‌కు ఢిల్లీ సర్కారు బ్రేక్
కరోనా వైరస్ మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ మరికొన్ని నియంత్రణ చర్యలను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఐపీఎల్ సహా అన్ని క్రీడాపోటీలపై నిషేధం విధించింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఐపీఎల్ సహా ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్న అన్ని క్రీడలపైనా నిషేధం విధించాలని నిర్ణయించాం. కరోనా వైరస్‌ను నిలువరించేందుకు సాంఘికంగా పరస్పరం దూరం పాటించడం చాలా అవసరం…’’ అని పేర్కొన్నారు. సెమినార్లు, కాన్ఫరెన్సులు సహా 200 మందికి మించి సమావేశమయ్యే ఎలాంటి కార్యక్రమాలను ఢిల్లీలో అనుమతించబోమని సిసోడియా పేర్కొన్నారు.దక్షిణ కొరియాలో ఈ వైరస్ సోకిన 30 మందిని ప్రత్యేకంగా ఉంచినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘ తర్వాత 31వ వ్యక్తి మరో 10 వేల మందికి వైరస్‌ను వ్యాప్తి చేశాడు. అయితే ఢిల్లీలో ఆ పరిస్థితిని నిరోధించే ప్రయత్నంలో భాగంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో సాంఘికంగా కొంత దూరం పాటించడమే చక్కటి పరిష్కారం…’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. కాగా ఈ నెల 31 వరకు దేశరాజధానిలోని అన్ని సినిమా హాళ్లు మూసివేయాలంటూ ఆదేశించిన మరుసటి రోజే ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
7. కరోనా ఎఫెక్ట్: భారత ఎంబసీల్లో 24×7 హెల్ప్‌లైన్లు
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపుతున్న కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికానూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటూ భారత్‌లోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. అందులో భాగంగా వివిధ దేశాల ప్రయాణాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. దీంతో అత్యధిక మంది భారతీయులు ఉండే అమెరికాలో భారత ప్రభుత్వ ప్రయాణ ఆంక్షలపై పూర్తి వివరాలు తెలియజేసేందుకు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. ఇవి 24 గంటలూ పనిచేయనున్నాయి
8. టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడొచ్చు: ట్రంప్
ఈ ఏడాది నిర్వహించే టోక్యో ఒలింపిక్స్ 2020 క్రీడలను ఏడాదిపాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్ ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్-19 (కరోనా వైరస్) కారణంగా ఇప్పటికే అనేక క్రీడా టోర్నీలు రద్దవుతుండగా, మరిన్ని వాయిదా పడుతున్నాయి. ఇంకొన్ని టోర్నీలు ప్రేక్షకులు లేకుండానే కొనసాగుతున్నాయి. మరోవైపు ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా నుంచి పెద్ద సంఖ్యలో అథ్లెట్లు పాల్గొంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడలను వాయిదా వేయాలని ట్రంప్ గురువారం టోక్యో అధికారులకు సూచించారు
9. కృష్ణా జిల్లాలో కరోనా అనుమానిత కేసు
కృష్ణాజిల్లాలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. జర్మనీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని గన్నవరం విమానాశ్రయంలో వైద్యులు పరీక్షించారు. ప్రయాణికుడికి దగ్గు, జలుబు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుడు నిన్న జర్మనీ నుంచి బయల్దేరి దిల్లీ మీదుగా ఇండిగో విమానంలో గన్నవరం చేరుకున్నాడు. అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపనున్నట్లు వైద్యలు తెలిపారు.
10. కరోనాపై అమితాబ్ కవిత..!
ప్రపంచదేశాలతో పాటు భారత్‌ను కలవరపెడుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే తాను స్వయంగా రాసిన ఓ కవితను వినిపిస్తున్న వీడియోని ట్విటర్‌లో పోస్టుచేశారు. ప్రజలు చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఉసిరి, కలోంజి రసాలను సేవించాలని సూచించారు.
11. 70 శాతం కొత్త కేసులు ఐరోపాలోనే..!
తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో కరోనా వైరస్(కొవిడ్-19) భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారం కొత్తగా కేవలం ఎనిమిది కేసుల మాత్రమే నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 80,813కు చేరింది. ఇక మరో ఏడు మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య 3,176ను తాకింది. వైరస్ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పట్టడంతో వుహాన్‌లో ప్రయాణాలపై ఉన్న ఆంక్షల్ని కాస్త సడలించారు. మరోవైపు దక్షిణకొరియాలో కొత్తగా వైరస్ సోకిన వారికంటే కోలుకొని ఇళ్లకు చేరుతున్న వారి సంఖ్య పెరిగడం విశేషం. గురువారం కొత్తగా 110 మంది వైరస్ బారిన పడగా.. మరో 177 మంది కోలుకొని ఆస్పత్రిని వీడారు. ఆ దేశంలో బాధితుల సంఖ్య 7,979కి, మృతుల సంఖ్య 67కు చేరింది.
12. కరోనా కట్టడికి తితిదే చర్యలు
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టంది. కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాన్ని తితిదే ఆవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రారంభించారు. అలిపిరి టోల్‌గేట్, శ్రీవారిమెట్టు, అలిపిరి కాలినడక ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్యశిబిరాల్లో థర్మల్ గన్ లు అందుబాటులో ఉంచారు. దగ్గు, జలుబుతో బాధపడే భక్తులకు వైద్య శిబిరంలో చికిత్సలు అందిస్తున్నారు. ప్రాథమిక పరిశీలన అనంతరం భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని కల్యాణోత్సవం నిర్వాహణపై తితిదే పునారాలోచనలో పడింది. లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో .. కార్యక్రమం నిర్వహణపై సమీక్షించాలని ఈమేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కల్యాణోత్సవం నిర్వహణపై చర్యలు తీసుకుంటామని తితిదే వెల్లడించింది.
13. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం, ఆయా రాష్ట్రాలు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. దిల్లీలో పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. కరోనా వైరస్‌ను అంటువ్యాధిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నింట్లో చర్యలు చేపట్టడాన్ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు. కేరళలోనూ విద్యాసంస్థలు, సినిమా హాళ్లను ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.దేశంలో కొత్తగా మరో విదేశీయుడు సహా 14 మందిలో కరోనా (కొవిడ్-19) లక్షణాలు బయటపడడంతో ఇంతవరకు 74 మందికి ఈ వైరస్ సోకినట్లయింది. 74 మంది రోగులతో కలిసిమెలిసి తిరిగిన సుమారు 1500 మందిపై వైద్య పరిశీలన కొనసాగుతోంది. రోగుల్ని విడిగా ఉంచడానికి మరో ఏడు చోట్ల రక్షణ మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, స్థానికంగా ఒకరి నుంచి ఒకరికి తప్పిస్తే మొత్తం సమాజానికి ఈ వైరస్ వ్యాపించినట్లుగా ఎక్కడా బయటపడలేదని ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి తిరిగి ప్రకటించేవరకు రాష్ట్రపతి భవన్ లోపలకు సందర్శకులను అనుమతించబోరు.
14. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రిగోయిర్ ట్రుడోకు కరోనావైరస్ సోకిందని తేలింది. బ్రిటన్ దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన సోఫీ గ్రిగోయిర్ ట్రుడోకు ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆమెను పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో సోఫీ గ్రిగోయిర్ ట్రుడోను స్వయం ఐసోలేషన్ గదికి తరలించారు. గురువారం రాత్రి నా భార్య సోఫీ గ్రిగోయిర్ కు జ్వరంగా అనిపించడంతో ఆమెకు వైద్యపరీక్షలు చేయించగా కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో వైద్యుల సలహాపై ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతోంది అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చెప్పారు. తన భార్యకు కరోనా వైరస్ సోకడంతో తాను ముందుజాగ్రత్త చర్యగా ఇంటి నుంచే పనిచేస్తున్నానని కెనడా ప్రధాని ట్రుడో ప్రకటించారు.ఫోన్ కాల్స్, సమావేశాలను అన్నీ ఆన్ లైన్ లోనే వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని ట్రుడో చెప్పారు…
15. భారత స్టాక్ మార్కెట్ పతనం, ఇండియాలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య, తొలి మరణం ధ్రువీకరణ కావడం, ఇతర దేశాలకు విమానాల రద్దుతో ఏర్పడిన ప్రతిష్ఠంభనలపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులందరినీ రావాలని పీఎంఓ నుంచి వర్తమానాలు వెళ్లాయి. ఈ ఉదయం 10 గంటలకు మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగనుండగా, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. కరోనా వ్యాధి అనుమానితులు తిరుగాడిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోదీ మంత్రులతో చర్చించనున్నారని తెలుస్తోంది…
16. నెల్లూరు జిల్లా కరోనా పాజిటివ్ రాగానే మా స్కూలుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఒక మాస్క్ ఖరీదు మూడు రూపాయలు ఉన్న మాస్క్ 30 రూపాయల నుండి ఇ 50 రూపాయల వరకు పలుకుతుంది. సామాన్యుడు మాస్క్ కొనాలంటే భయపడుతున్నాడు. కరో నాతో భయపడుతున్న ప్రజలకు కు ప్రభుత్వ మే ఈ మాస్క్ లను అందజేయాలని కోరుతున్నారు
17. భారత్‌లో కరోనా కేసులు@75
భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 75 కొవిడ్-19 కేసులు నమోదు కాగా.. ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో మంగళవారం మరణించిన 70 ఏళ్ల కర్ణాటక వ్యక్తి కరోనాతోనే మృతి చెందారని ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు చెప్పారు. ఇప్పటివరకు దేశంలోని పలు విమానాశ్రయాల్లో దాదాపు 11లక్షల 14వేల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
18. గూగుల్ ఉద్యోగికి కరోనా..!
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రస్తుతం మన దేశంలోనూ విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 బారినపడుతున్న వారిసంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయ్యింది. తమ కంపెనీ ఉద్యోగికి కొవిడ్-19 నిర్ధారణ అయినట్లు గూగుల్ స్వయంగా వెల్లడించింది. వెంటనే అతన్ని ప్రత్యేక పరిశీలనలో ఉంచినట్లు పేర్కొంది. అంతేకాకుండా అతనితో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను ఇంటికే పరిమితం కావాలని, ఏదైనా అనారోగ్యానికి గురైతే వారుకూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించినట్లు తెలిపింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తమ కంపెనీ ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయాలని సూచించింది. ఇప్పటికే అమెరికా, యూరప్ కార్యాలయాల్లోని తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేసేలా చర్యలు చేపట్టింది. తాజాగా బెంగళూరు కార్యాలయ ఉద్యోగులు కూడా ఇంటినుంచే పనిచేయాలని తెలిపింది.
19. కరోనా భయం: కాన్ఫరెన్స్ కాల్‌లో ఐసీసీ సమావేశం
కరోనా (కోవిడ్-29) కారణంగా ఈ నెలాఖరులో జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని కాన్ఫరెన్స్ కాల్‌లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. మార్చి 26 నుంచి 29 వరకు జరగాల్సిన బోర్డు సమావేశాన్ని మే తొలి వారానికి వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. అత్యవసర విషయాలను మాత్రమే అక్కడ చర్చిస్తామని ఐసీసీ వివరించింది. ‘ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కోవిడ్-19ను దృష్టిలో పెట్టుకొని, సభ్యత్వ దేశాల విజ్ఞప్తి మేరకు ఈ నెలాఖరులో జరగాల్సిన బోర్డు సమావేశాన్ని కాన్ఫరెన్స్ కాల్‌లో నిర్వహిస్తున్నాం. ఆయా బోర్డుల అధికారులు కాన్ఫరెన్స్ కాల్‌లోనే పాల్గొంటారు. వారి ఆరోగ్య భద్రతే మాకు ముఖ్యం. అత్యవసర విషయాలను మాత్రమే మే తొలి వారంలో నిర్వహించే సమావేశంలో చర్చిస్తాం’ అని ఐసీసీ పేర్కొంది.
20. కెనడా ప్రధాని భార్యకు కరోనా
కరోనా మహమ్మారి దేశాధినేతల్ని సైతం వణికిస్తోంది. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీకి కరోనా వైరస్ సోకినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. గురువారమే ఆమెకు ఫ్లూ సంబంధిత లక్షణాలు ఉండడంతో ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో సైతం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. తన భార్యకు వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు నిన్న తెలిపారు. సోఫీ ఇటీవలే బ్రిటన్‌లో ఓ కార్యక్రమానికి హాజరై వచ్చారు. అక్కడే ఆమెకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సోఫీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల సలహాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ట్రూడో కమ్యూనికేషన్ డైరెక్టర్ కామెరూన్ అహ్మద్ వెల్లడించారు. లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు. ట్రూడో మాత్రం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు.
21. ఏపీ, తెలంగాణలో హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..
రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైన సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. తెలంగాణలో హెల్ప్‌లైన్ నంబరు 104, ఏపీలో 0866 2410978, సెంట్రల్ హెల్ప్‌లైన్ నంబరు 011 23978046 ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
22. 70 శాతం కొత్త కేసులు ఐరోపాలోనే..!
తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో కరోనా వైరస్(కొవిడ్-19) భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారం కొత్తగా కేవలం ఎనిమిది కేసుల మాత్రమే నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 80,813కు చేరింది. ఇక మరో ఏడు మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య 3,176ను తాకింది. వైరస్ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పట్టడంతో వుహాన్‌లో ప్రయాణాలపై ఉన్న ఆంక్షల్ని కాస్త సడలించారు. మరోవైపు దక్షిణకొరియాలో కొత్తగా వైరస్ సోకిన వారికంటే కోలుకొని ఇళ్లకు చేరుతున్న వారి సంఖ్య పెరిగడం విశేషం. గురువారం కొత్తగా 110 మంది వైరస్ బారిన పడగా.. మరో 177 మంది కోలుకొని ఆస్పత్రిని వీడారు. ఆ దేశంలో బాధితుల సంఖ్య 7,979కి, మృతుల సంఖ్య 67కు చేరింది. యూరప్‌లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఇటలీలో మృతుల సంఖ్య 1016కు చేరింది. గురువారం ఒక్కరోజే 189 మంది చనిపోయారు. కొత్తగా 2651 మంది వైరస్ బారిన పడగా బాధితుల సంఖ్య 15 వేలు దాటింది. చికిత్సలో సాయం అందించేందుకు చైనా వైద్య బృందం ఇటలీ వెళ్లింది. ఇరాన్‌లో నిన్న ఒక్కరోజే 75 మంది మరణించగా.. మొత్తం సంఖ్య 429కి చేరింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడేందుకు రూ.37వేల కోట్ల రుణం కావాలని ఇరాన్ ఐఎంఎఫ్‌ను కోరింది. ఖతార్‌లో 262 కేసులు నమోదు కాగా, విద్యసంస్థల్ని పూర్తిగా మూసివేశారు. అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా మరణాలు ఆగడం లేదు. ఇప్పటి వరకు 41 మంది మృతిచెందగా.. కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1729కి చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సైతం కరోనా సెగ తాకింది. అన్ని ప్రచార ర్యాలీలను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కాలిఫోర్నియాలో ప్రఖ్యాత డిస్నీలాండ్ పార్క్‌ను మూసివేశారు. అమెరికా వ్యాప్తంగా పండుగలు, ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. 500 మందికంటే ఎక్కువ మంది గుమిగూడకుండా న్యూయార్క్‌లో నిషేధాజ్ఞలు విధించారు. మరోవైపు ఇటీవలే డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్ అధికార ప్రతినిధికి సైతం కరోనా ఉన్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను సంవత్సరం పాటు వాయిదా వేయాలని ట్రంప్ కోరారు. ఐరోపా దేశాలను కరోనా తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. స్పెయిన్‌లో ఉద్ధృతి పెరుగుతుండడంతో నాలుగు ముఖ్య పట్టణాలను పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. దీంతో దాదాపు 66 వేల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిన్న ఒక్కరోజే 31 కేసుల అదనంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ మంత్రికి వైరస్ ఉన్నట్లు తేలడంతో అక్కడి మంత్రివర్గం, రాజవంశీకులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మరోవైపు బెల్జియం, రోమ్‌లలో చర్చిలను మూసివేశారు. రెండు వారాల పాటు విద్యాసంస్థల్ని మూసివేస్తున్నట్లు ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనాను ‘అత్యంత దారుణ ప్రజారోగ్య సంక్షోభం’గా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇప్పటివరకు ఆ దేశంలో 590 కేసులు నమోదైనప్పటికీ.. ఈ సంఖ్య ఐదు నుంచి 10 వేల మధ్య ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అటు దాయాది దేశం పాకిస్థాన్‌ను కరోనా కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 21 కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా సింధ్ రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్ని మే 31 వరకు మూసివేశారు. బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి వైరస్ నిర్ధారణ కావడంతో దేశంలో బాధితుల సంఖ్య 75కు చేరింది. వీరిలో ఒకరు నిన్ని మరణించిన విషయం తెలిసిందే. పలు విమానాశ్రయాల్లో దాదాపు 11లక్షల 14వేల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారీ జనం హాజరయ్యే ఐపీఎల్ వంటి క్రీడల నిర్వహణను అనుమతించబోమని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.
23. కరోనా ఎఫెక్ట్: భారత ఎంబసీల్లో 24×7 హెల్ప్ లైన్లు
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపుతున్న కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికానూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటూ భారత్‌లోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి కోసం భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. అందులో భాగంగా వివిధ దేశాల ప్రయాణాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. దీంతో అత్యధిక మంది భారతీయులు ఉండే అమెరికాలో భారత ప్రభుత్వ ప్రయాణ ఆంక్షలపై పూర్తి వివరాలు తెలియజేసేందుకు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. ఇవి 24 గంటలూ పనిచేయనున్నాయి
24. కృష్ణా జిల్లాలో కరోనా అనుమానిత కేసు
కృష్ణాజిల్లాలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. జర్మనీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని గన్నవరం విమానాశ్రయంలో వైద్యులు పరీక్షించారు. ప్రయాణికుడికి దగ్గు, జలుబు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుడు నిన్న జర్మనీ నుంచి బయల్దేరి దిల్లీ మీదుగా ఇండిగో విమానంలో గన్నవరం చేరుకున్నాడు. అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపనున్నట్లు వైద్యలు తెలిపారు.
25. కరోనాను విపత్తుగా ప్రకటించిన ఒడిశా
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ప్రభావంతో కేరళ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ వరకు కేరళ అసెంబ్లీ కొనసాగాల్సి ఉంది. కరోనా వైరస్‌ను విపత్తుగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీని కూడా మార్చి 29 వరకు వాయిదా వేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. కేరళ, ఒడిశాతో పాటు ఉత్తరప్రదేశ్‌లో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సినిమా హాళ్లను మూసివేశారు.
26. కరోనా ఎఫెక్ట్: కేరళాలో అమ్మవారికి నైవేద్యాలు-అట్టుక్కల్ సంబురం ఆరంభం
కేరళలో కరోనా వైరస్ కేసులున్నా అక్కడి జనాలు భయపడడం లేదు. కేరళలో ఏటా జరిగే ఒక సంబురానికి ప్రభుత్వంకూడా అనుమతినిచ్చింది. వేలాది మంది గుమిగూడే చోట వైరస్ వ్యాపిస్తుందన్న వార్నింగ్ల్ని సైతం లెక్క చేయలేదు. అంటువ్యాధులు వచ్చినప్పుడు అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం మామూలే. అదే ఆనవాయితీతో రోజూ వేలాదిమంది మహిళలు పొంగల్ వండి నైవేద్యం పెడుతున్నారు.కేరళలో ప్రతి ఏడాది జరిగే ‘అట్లుక్కల్ పొంగల్’ సంబురం ఇప్పుడు చాలా భక్తిగా జరుపుకుంటున్నారు. ఇది వరల్డ్ ఫేమస్ కావడంతో విదేశీ టూరిస్టులుకూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, ఇది నూటికి నూరు శాతం ఆడవాళ్ల పండుగ. మగవాళ్లకు ఇందులో అసలు ప్రవేశమే లేదు. కేరళలో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం ఈసారి వేడుకలు జరుపుకోవడానికి పర్మిషన్ ఇస్తుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే, అటుక్కల్ పొంగల్ పండుగని ఎవరింట్లో వాళ్లు కూర్చుని చేసుకోరు. త్రివేండ్రంలోని అటుక్కల్ అమ్మవారి దేవాలయానికి పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి అక్కడి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం ప్రాంగణంలోనూ, ఆ చుట్టుపక్కల రోడ్లమీద కూడా అమ్మవారికోసం పొంగల్ వండుతుంటారు. మూడు ఇటుక రాళ్లపై కొత్త కుండను పెట్టి, కట్టెల మంటతో పొంగల్ నైవేద్యం వండుతారు. పది రోజులపాటు జరిగే ఈ వేడుకకు రోజూ వేలాదిమంది మహిళలు వస్తుంటారు. కరోనా వైరస్ భయాన్ని లెక్కచేయకుండా చివరిక్షణంలో పినరయి విజయన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ‘అటుక్కుల్ పొంగల్’ సంబురానికి కొన్ని నెలల ముందు నుంచే ఏర్పాట్లు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. రు. చివరిక్షణంలో కరోనా పేరు చెప్పి పండుగకు పర్మిషన్ ఇవ్వకూడదని అనుకున్నా… జనాలు ఒప్పుకోలేదు. అయితే, ఈ పండుగకి ఫారిన్ టూరిస్టులుకూడా వస్తారు కాబట్టి, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ ఐడెంటిఫై అయిన దేశాల నుంచి వచ్చేవారిని అమ్మవారి ఆలయం దగ్గరకు రావద్దని ప్రభుత్వం కోరింది. వాళ్లు దిగిన హోటల్లోనే పూజలు చేసుకోవాలని త్రివేండ్రం అధికారులు చెప్పారు.
27శబరిమలకు రాకండి
అయ్యప్ప స్వామికి ప్రతి నెలా జరిగే పూజలపై కరోనా ప్రభావం పడింది. ఈసారి శబరిమలకు ఎవరూ రావద్దని దేవస్థానం కోరింది. వేలాదిమంది గుమిగూడే చోట కరోనా వేగంగా వ్యాపిస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్లు హెచ్చరించడమే ఇందుకు కారణం. అయితే ఆలయంలో ఎలాంటి మార్పులు లేకుండా పూజలు జరుగుతాయని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ అప్పీల్ గురించి తెలియక ఎవరైనా వస్తే వాళ్లను ఆపబోమని క్లారిటీ ఇచ్చింది. కల్చరల్ యాక్టివిటీని రద్దు చేసుకోవాలని బోర్డు పరిధిలోని మిగతా ఆలయాల కమిటీలకు కూడా సలహానిచ్చింది. మార్చి నెలాఖరు వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ తరువాత కరోనా పరిస్థితులపై ప్రభుత్వం సమీక్షించాక ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిలాఉంటే, పది రోజులపాటు జరిగే ‘అట్లుక్కల్’ సంబురానికి మాత్రం కేరళ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
28. ఇండియాలో కరోనా కేసులు74: కొత్తగా 14 మంది
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా 73 మంది కొవిడ్ బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 13 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అందులో 9 కేసులు మహారాష్ట్రలోనే రిపోర్ట్ అయ్యాయని, ఢిల్లీ, లడఖ్, యూపీలో ఒక్కొక్కరికి, మరో విదేశీయుడికి పాజిటివ్గా తేలిందని తెలిపింది. మొత్తం నమోదైన కేసుల్లో విదేశీయులు 17 మంది ఉన్నట్టు పేర్కొంది. రాష్ట్రాల వారీగా నమోదైన కొవిడ్ కేసుల వివరాలను ప్రకటించింది. కొవిడ్ ప్రభావిత దేశాల్లోని ఇండియన్లు తిరిగి రావాలంటే అక్కడి అధికారుల నుంచి కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. దానిపై అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897లోని సెక్షన్ 2ను ప్రయోగించాల్సిందిగా ఆరోగ్య శాఖ సూచించింది. కొవిడ్పై పోరాడేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని ప్రయోగించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి చైర్మన్గా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్ఈసీ)ని ఏర్పాటు చేసింది. కొవిడ్పై అధికారులు, సిబ్బందికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్అవగాహన కల్పిస్తోంది. అంతేగాకుండా వాహనదారులకూ సలహాలు, సూచనలిస్తోంది. బ్రీత్ అనలైజింగ్ టెస్టులు చేసేటప్పుడు అందరికీ వేర్వేరు స్ట్రాలు వినియోగించాల్సిందిగా సూచించింది.
*మేమెక్కడికి పోవాలి?
ఇటలీ ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయిన ఇండియన్ల పరిస్థితి గందరగోళంగా తయారైంది. రోమ్, మిలాన్ ఎయిర్పోర్టుల్లో దాదాపు 300 మంది ఇండియన్లు లాక్ అయిపోయారు. అందులో గర్భిణులు, పిల్లలూ ఉన్నారు. ఎయిర్పోర్టులో చిక్కుకున్న కేరళ మహిళ ఒకరు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఉన్న పళంగా అన్నింటినీ బంద్చేస్తే తామెక్కడికి పోవాలని ప్రశ్నించారు. వెంటనే తమను ఇండియాకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, ఇటలీ అధికారులు, ఇండియన్ అధికారులే కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ కావాలని పట్టుబడుతున్నారంటూ వాపోతున్నారు. ‘‘డియర్ ఫ్రెండ్స్. మేమంతా ఇండియాకు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నాం. విమానం ఎక్కేందుకు ఇటలీ అధికారులు ఒప్పుకోవట్లేదు. సర్టిఫికెట్ కోసం పట్టుబడుతున్నారు. ఇండియన్ గవర్నమెంట్ నుంచి అనుమతి లేదని చెబుతున్నారు. చిన్న పిల్లలు, గర్భిణులూ ఇక్కడ చిక్కుకుపోయారు. మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లకపోతే మేమంతా ఎక్కడికి పోవాలి?’’ అని ఆమె ఆ వీడియోలో ప్రశ్నించారు. గడ్డకట్టకుపోయే చలిలో ఎయిర్పోర్టులోని ఓ మూలన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామన్నారు.
*ఇరాన్లోని స్టూడెంట్లతో మాట్లాడండి
ఇరాన్లో చిక్కుకుపోయిన ఇండియన్ స్టూడెంట్లతో వెంటనే మాట్లాడాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. స్టూడెంట్లతో అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు టచ్లో ఉండేలా చూడాలని సూచించింది. దీనిపై ఈ నెల 17న రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇరాన్లో చిక్కుకున్న ఇండియన్ స్టూడెంట్ల తల్లిదండ్రులు వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు, ఈ ఆదేశాలిచ్చింది.
*వాఘాలో రిట్రీట్ బంద్
కరోనా వైరస్ నేపథ్యంలో అటారీ–వాఘా సరిహద్దుల్లో నిర్వహించే బీటింగ్ రిట్రీట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. దాని ప్రభావం అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై పడింది. రోజూ అక్కడికి 50 వేల మంది దాకా బీటింగ్ రిట్రీట్ను చూసేందుకు వెళ్తుంటారు. ఆ టూరిస్టులతోనే హోటళ్లు, షాపుల వాళ్ల బతుకు బండి నడిచేది. కానీ, ఇప్పుడు బీటింగ్ రిట్రీట్ను రద్దు చేసేయడంతో తామెట్లా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ట్యాక్సీ డ్రైవర్లపైనా ఆ ప్రభావం పడింది.
*ఇటలీ మొత్తం బంద్
కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ఇటలీ మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటిదాకా ట్రావెల్ బ్యాన్ విధించిన సర్కార్, ఇప్పుడు మెడికల్ షాపులు తప్ప బార్లు, స్టోర్లు, సూపర్మార్కెట్లన్నింటినీ రెండు వారాల పాటు బంద్ పెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ‘‘దేశం కోసం త్యాగం చేస్తున్న జనాలందరికీ థ్యాంక్స్. మనం ఓ గొప్ప దేశంగా నిరూపించుకుంటున్నాం. దానిని మరింత గట్టిగా ప్రూవ్ చేయాలి. ఇకపై అత్యవసరాలైన ఫుడ్స్టోర్లు, మెడికల్ షాపులు తప్ప ఏవీ ఓపెన్ ఉండవు. బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, హెయిర్డ్రెస్ సెలూన్లు, క్యాంటీన్ల వంటివి అన్నింటినీ బంద్ పెట్టాల్సిందే. అలాగని ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదు. కావాల్సిన వస్తువులను హోం డెలివరీ చేస్తారు’’ అని దేశ ప్రధాని గ్వెసెప్ కాంటీ ప్రకటించారు. కొవిడ్తో పోరాడేందుకు సుమారు రూ.2.08 లక్షల కోట్లను (2,800 కోట్ల డాలర్లు) ఫండ్ను విడుదల చేసింది. ఇటలీలో ఒక్క రోజులోనే కొవిడ్ మరణాలు 31 శాతం పెరిగాయి. చనిపోయిన వారి సంఖ్య 827కి చేరింది. దేశంలోని 17 స్టోర్లను మూసేస్తున్నామని యాపిల్ ప్రకటించింది. ఆస్ట్రేలియా రూ.85 వేల కోట్లు విడుదల చేసింది.
పోరాటం పెంచాల్సిందేకొవిడ్ మరింత విస్తరించకుండా ప్రపంచ దేశాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. ప్యాండెమిక్గా ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ, ప్రతి దేశమూ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పటిష్టమైన చర్యలు తీసుకుంటే కరోనా మహమ్మారిని పారదోలొచ్చని స్పష్టం చేశారు. ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత లేనివాళ్లకు, వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే వృద్ధులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు అనుమతులను చైనా సర్కార్ రద్దు చుఏసింది.
*4,749 మంది బలి
కొవిడ్కు ప్రపంచవ్యాప్తంగా 4,476 మంది బలయ్యారు. 1,29,641 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 125 దేశాలకు వైరస్ పాకింది. చైనాలో 80,796 కేసులు నమోదవగా, 3,169 మంది చనిపోయారు. ఇటలీలో 12,462 కేసులు నమోదయ్యాయి. ఇరాన్లో 10,075 కేసులకుగానూ 429 మంది చనిపోయారు. సౌత్ కొరియాలో 7,869 కేసులు, 66 మరణాలు రికార్డయ్యాయి. స్పెయిన్లో 84, ఫ్రాన్స్లో 48, అమెరికాలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కేసుల సంఖ్య 1,364కి పెరిగింది.
29. కరోనా కలకలంతో ఈనెలాఖరు వరకూ కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో ఉన్న మూడు థీమ్ పార్క్ లను మూసి వేస్తున్నట్టు వాల్ట్‌డిస్నీ శుక్రవారం వెల్లడించింది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న క్రమంలో డిస్నీ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకూ డిస్నీ క్రూయిజ్ లైన్ అన్ని డిపార్చర్లను రద్దు చేసింది. ఫ్లోరిడాలోని వాల్ట్‌డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లోని మూడు థీమ్ పార్క్‌లను, డిస్నీలాండ్ పారిస్ రిసార్ట్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక తమ డిస్నీల్యాండ్, కాలిఫోర్నియా అడ్వంచర్ థీమ్ పార్క్‌లను శనివారం నుంచి మూసివేస్తామని డిస్నీ ఇప్పటికే ప్రకటించింది.
30. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ మెల్లిమెల్లిగా విశ్వవ్యాపితం అవుతోంది. కరోనా వైరస్ రోజురోజుకూ ఉధృత రూపం దాలుస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కూడా హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు నమోదైంది. పెగడపల్లి మండలం లింగపూర్ యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు సమాచారం. తీవ్ర జ్వరం, జలుబుతో యువకుడు ఆస్పత్రిలో చేరాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి యువకుడు వచ్చినట్లు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన 5 వేల పడకలను అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రులపైనే ఆధారపడకూడదని నిర్ణయించింది. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణవాసులు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. వారిని తీసుకొచ్చే బాధ్యత తమది కాదని, కేంద్రానిదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇటలీకి రవాణా సౌకర్యాలు బంద్ కావడంతో ఎంఎస్ చేసేందుకు అక్కడికెళ్లిన తెలంగాణ విద్యార్థులు సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు.
31. కడప రిమ్స్‌లో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మక్కా నుంచి నగరానికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమె జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసంతో బాధపడుతుండటంతో రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు కరోనా అనుమానిత వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి కూడా రెండు రోజుల క్రితం గల్ఫ్ నుంచి నగరానికి వచ్చారు. ఆయనకు సైతం దగ్గు, జలుబు, జ్వరం అధికంగా ఉండటంతో రిమ్స్‌కు తరలించారు. వీరిద్దరికీ కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో రిమ్స్‌లోనే కరోనా ప్రత్యేక వార్డులో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి నుంచి నమూనాలను సేకరిస్తున్నారు.
127 దేశాలకు పాకిన కొరోనా-TNI ప్రత్యేక కథనాలు
Related tags :