రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు విపత్కరణ పరిణామాలను ఎదుర్కొన్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కవాతు రోజు లక్షల మంది రోడ్లపైకి వచ్చారని.. కానీ ఓట్లు మాత్రం రౌడీలకు వేశారన్నారు. ఉత్తరాంధ్రలో తుఫాన్ వస్తే నాలుగు రోజులపాటు చీకటి రాత్రులను గడిపామన్నారు. పక్కనే పర్యటిస్తున్న జగన్ ఆ జిల్లా వైపు కూడా చూడలేదని పవన్ వెల్లడించారు. అలాంటి వాళ్ళను గెలిపించారంటే తప్పు ఎవరిదని ప్రశ్నించారు. ఓటమిని తట్టుకున్నాను కాబట్టే ఈరోజు నిలబడ్డానని పవన్ వెల్లడించారు. బీజేపీ వారసత్వ పార్టీ కాదని.. అందుకే పొత్తు పెట్టుకున్నామన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అనే భావన ఏర్పడిందని.. దానిని నివృత్తి చేసి మైనార్టీలను ఒప్పించి పొత్తు పెట్టుకున్నామని పవన్ స్పష్టం చేశారు.
నా సభలకు జనం భారీగా వచ్చారు…ఓట్లు రౌడీలకు వేశారు
Related tags :