Politics

కృష్ణాజిల్లా జడ్పీటీసీ పోరు నుంచి వైదొలిగిన 36 మంది

Krishna District ZPTC 2020 Elections

కృష్ణాజిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ పోరు నుంచి 36 మంది వైదొలిగారు. నామపత్రాల పరిశీలనలో 16 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. శుక్రవారం 20 మంది అభ్యర్థులు తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. మూడు రోజుల పాటు సాగిన నామపత్రాల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలకు 331 మంది నామపత్రాలు సమర్పించారు. గురువారం నిర్వహించిన నామపత్రాల పరిశీలనలో డబల్‌ ఎంట్రీతో ఉన్న 15, మండల ప్రాదేశిక నియోజకవర్గ పరిధిలో ఓటు లేదన్న కారణంతో ఒక నామపత్రాన్ని అధికారులు తిరస్కరించారు. పెడన నుంచి జనసేన తరఫున నామపత్రం సమర్పించిన అభ్యర్థి ఓటు అర్బన్‌లో ఉండటంతో తిరస్కణకు గురయ్యింది. నామపత్రాల ఉపసంహరణ గడువు శనివారం వరకూ ఉన్నా వివిధ నియోజకవర్గాల నుంచి 20 మంది తమ నామపత్రాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.
***తిరస్కరించిన నామపత్రాల వివరాలు
ఎం.వెంకటరమణ(వైకాపా, బంటుమిల్లి), పి.మల్లేశ్వరి(తెదేపా, చల్లపల్లి), వీఎస్‌ రంగబాబు(వైకాపా, గూడూరు), ఆర్‌.సంధ్య(తెదేపా, ఇబ్రహీంపట్నం), ఆర్‌.మాధవి(తెదేపా, ఇబ్రహీంపట్నం), కె.మౌక్తిక( వైకాపా, కైకలూరు), వైవీఆర్‌ కుమారి(వైకాపా, పమిడిముక్కల), వి.వి.రమాదేవి(జనసేన, పెడన), కె.జె.చౌదరి(స్వతంత్ర, పెదపారుపూడి), ఎం.దేదీప్య(వైకాపా, పెదపారుపూడి), ఎం.నాగేశ్వరరెడ్డి(తెదేపా, రెడ్డిగూడెం), జి.సుమన్‌కుమార్‌( తెదేపా, విజయవాడ), కె.సువర్ణరాజు(స్వతంత్ర, విజయవాడ), కె.ప్రేమకుమార్‌(స్వతంత్ర, విజయవాడ), ఎన్‌.శ్రీనివాసరావు( తెదేపా, విస్సన్నపేట), ఎన్‌.శ్రీనివాసరావు(తెదేపా, విస్సన్నపేట).
***నామపత్రాలు ఉపసంహరించుకున్నవారు
బాణావతు కేష్య(వైకాపా, ఎ.కొండూరు), బి.సుబ్రహ్మణ్యం(భాజపా, అవనిగడ్డ), ఎం.జయలక్ష్మి(వైకాపా, జి.కొండూరు), టి.వరలక్ష్మి(తెదేపా, ఘంటసాల), ఎం.నాగలక్ష్మి(తెదేపా, గుడ్లవల్లేరు), బి.కోమలి(వైకాపా, కంకిపాడు), ఎస్‌.నాగరాణి(వైకాపా, మండవల్లి), జి.ప్రసాద్‌(జనసేన, మోపిదేవి), పి.పావని(వైకాపా, ముదినేపల్లి), ఇ.గంగమ్మ(వైకాపా, ముదినేపల్లి), పి.ఎన్‌.సురేంద్రబాబు(వైకాపా, మైలవరం), ఎ.ఆదినారాయణ(తెదేపా, నాగాయలంక), వి.వీరాస్వామి(తెదేపా, నాగాయలంక), ఎస్‌.కోటేశ్వరమ్మ(తెదేపా, పామర్రు), కె.శివపార్వతి(తెదేపా, పెదపారుపూడి), వి.కళ్యాణి(వైకాపా, పెనుగంచిప్రోలు), జె.జ్ఞానేశ్వరరెడ్డి(వైకాపా, తోట్లవల్లూరు), కె.రాజేష్‌(తెదేపా, విజయవాడ), బి.నాగలక్ష్మి(వైకాపా, విస్సన్నపేట), తాతినేని పద్మావతి(వైకాపా, ఉయ్యూరు).