ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ పట్టణంను ప్రకటించాక అక్కడ భూ కబ్జాలు పెరిగిపోయాయని సాక్షాత్తు తన భూమినే కబ్జా చేయడానికి ప్రయత్నించారని ఏపీ భాజపా అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వాపోయారు. వైకాపా ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని మీడియా సమావేశంలో కన్నా ఆరోపించారు. వైజాగ్ లో భూముల యజమానులు తీవ్రంగా భయపడుతున్నారని తమ పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసారని తుపాకి గురిపెట్టి సెటిల్ మెంటు చేస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు. భీమిలి సమీపంలో స్వ్వ్యంగా నా స్థలాన్నే కబ్జా చేసే ప్రయత్నం జరిగింది. 1993లో చేపలుప్పడలో నేను స్థలం కొనుగోలు చేశాను విషయం తెలిసి ఆ అధికారి స్థలం కూడా కొట్టేసే ప్రయత్నం చేసారు. విషయం తెలిసి ఆ పోలీసు అధికారి నాకు ఫోన్ చేసి అలెర్ట్ చేసారు. భూ మాఫియా గ్యాంగే నా స్థలం కబ్జాకు ప్రయత్నిమ్చినై వైజాగ్లో భూ మాఫియాకు వందల మంది బాధితులయ్యారు. నా భూమికి కూడా కంచే వేసారు. అదేంటని అడిగితె భాజపా రాష్ట్ర అద్యక్షుడి స్థలం అని అనుకోలేదని నిందితులు చెబుతున్నారు అంటూ జరిగిన విషయన్ని మీడియాకు కన్నా వివరించారు.
నా భూమిని కూడా వదల్లేదు
Related tags :