వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో జరుగుతుంది. కరోనా కారణంగా ప్రభాస్ ఇటీవల మాస్క్ ధరించి జార్జియాకి వెళ్ళాడు. తాజాగా పూజా హెగ్డే కూడా ముఖానికి మాస్క్ ధరించి టర్కీలోని ఇస్తాంబుల్ మీదుగా జార్జియా వెళ్లింది. ఎన్నో జాగ్రత్తలతో పూజా జార్జియాకి వెళ్ళగా, ఇస్తాంబుల్‌లో తాను దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో పూజా హెగ్డే ముఖానికి మాస్క్‌తో పాటు చేతులకి గ్లౌస్ కూడా వేసుకున్నట్టు కనిపిస్తుంది. యూరప్‌లో కరోనా వైరస్ బీభత్సంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభాస్ 20 చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రభాస్ 20వ చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తుండగా, సమ్మర్‌లో లేదా ఏడాది చివరలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
కొరోనా భయం
Related tags :