WorldWonders

ఐస్‌క్రీం కోసం స్నేహితుడిని చంపిన ఢిల్లీ యువకుడు

Delhi Student Kills Friend Over Ice Cream Clash

వైద్యవిద్య పూర్తయిన సంతోషాన్ని మిత్రులతో పంచుకోవాలనుకున్న యువకుడు తన ఆవేశపూరిత చర్య వల్ల హత్యానేరంలో ఇరుక్కున్నాడు. ఈ దురదృష్టకర సంఘటన దేశ రాజధాని దిల్లీ శివార్లలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడు అమిత్‌ శర్మ కూడా ఈ ప్రాంతానికే చెందినవాడు. పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి…బుధవారం రాత్రి అమిత్‌ శర్మ మరో ఇద్దరితో కలసి ఇక్కడి సెక్టర్‌ 6 లో ఐస్‌క్రీమ్‌ తింటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థి లక్షయ్‌ ఎంబీబీఎస్‌ విద్య పూర్తయిన ఆనందంలో పార్టీ చేసుకోవాలనుకున్నాడు. అందుకు గాను తన సోదరుడు, ముగ్గురు స్నేహితులతో సహా శర్మ ఉన్న ఐస్‌క్రీమ్‌ స్టాల్‌ వద్దకు వచ్చాడు. ఐస్‌క్రీమ్‌ తిన్న అనంతరం తమతో సహా శర్మ, ఆయనతో వచ్చిన వారి బిల్లు కూడా చెల్లించబోయాడు. ఇందుకు శర్మ అభ్యంతరం తెలుపడంతో వివాదం మొదలయింది. అప్పటికి అక్కడినుంచి వెళ్లిపోయినా…అహం దెబ్బతిన్న నిందితులు అర్ధరాత్రి దాటాక మరోసారి శర్మ బృందంపై కర్రతో దాడి చేశారు. ఈ దాడిలో తలకు గాయాలైన శర్మ, అనంతరం మృతిచెందాడు. ఈ సంఘటనపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు ప్రత్యక్ష సాక్షులు, సీసీ టీవీ కెమేరాల సహాయంతో నలుగురు నిందితుల వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లను కనిపెట్టగలిగారు. అనంతరం వారందరినీ అరెస్టు చేశారు.