రైతు బంధు మంచి కార్యక్రమమేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రైతులకు ఎలాంటి సాయం చేసినా మంచిదేనన్నారు. రైతుబంధు ప్రయోజనాలు ధనవంతులకు కాకుండా నిజమైన పేద రైతులకే దక్కాలన్నారు. వివిధ శాఖల బడ్జెట్ పద్దులను మంత్రులు ప్రవేశపెట్టగా.. వీటిపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అన్నం పెట్టే రైతుకు రైతుబంధు పథకం మంచి కార్యక్రమం. మనలో చాలామంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాళ్లమే. ప్రభుత్వం ఖర్చు చేసే నిధులు నిజంగా వ్యవసాయం చేసేవాళ్లకు, పేద రైతులకు దక్కాలనేది నా ఉద్దేశం. రైతుబంధు నిధులు నా ఖాతాలో రూ.3లక్షలు జమయ్యాయి. భూస్వాములు, పెద్ద రైతులకు కూడా ప్రభుత్వం డబ్బులిస్తోంది. నాలాంటి వాళ్లకు రైతుబంధు డబ్బులు అవసరమా? ప్రభుత్వ సొమ్ము ప్రతిపేద రైతుకు అందాలి. రైతుబంధు కింద ఇచ్చే నిధులు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా ఖర్చు చేస్తే వ్యవసాయంచే ప్రతి వ్యక్తికీ లాభం చేకూరుతుంది’ అన్నారు.
కోమటిరెడ్డికి రైతుబంధు నిధులు
Related tags :