అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్ల వైద్యులు గుర్తించారు. ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన అతిచిన్న వయస్కురాలిగా శిశువు నమోదైంది. శిశువు తల్లి గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో నార్త్‌మిడిలెక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని లండన్ మెట్రో వార్తాపత్రిక తెలిపింది. ప్రసవం జరిగిన వెంటనే శిశువుకు నిర్వహించిన వైద్యపరీక్షలో కరోనావైరస్ ఉన్నట్లు బయటపడింది. ఈ వైరస్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు సోకిందా, లేక పుట్టిన వెంటనే సోకిందా అన్న కోణంలో వైద్యులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరిని వేర్వేరు ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం నాటికి యూకేలో కరోనా వైరస్ సోకిన కేసుల సంఖ్య 798కి చేరుకోగా, 10 మంది మృతి చెందారు.
తల్లి నుండి అప్పుడే పుట్టిన పాపకు కొరోనా
Related tags :