పొల్యూషన్ పెరుగుతున్నది. ముఖ్యంగా గాలి కాలుష్యం ఎక్కువ అవుతున్నది. అసలే కరోనా భయం. హానికర సూక్ష్మజీవులను నివారించడానికి స్వచ్ఛత అవసరం. అందుకే గాలిని స్వచ్ఛంగా మార్చే గ్యాడ్జెట్లు ఉన్నాయి. అవి చూడడానికి చిన్నగానే కనిపిస్తాయి. కానీ చాలా మేలు చేసిపెడతాయి. అసలే కాలుష్య సమస్య పెరుగుతున్న రోజులు వీటి అవసరం ఎంతో ఉంది. అర చేతిలో ఇమిడిపోయి మనకెంతో ఉపయోగపడతున్నాయి ఎయిర్ ప్యూరీఫయర్లు ఆయా రకాల కంపెనీలు ఈ వీటిని సాధారణ బడ్జెట్ ధరలోనే అందిస్తున్నాయి..
డైసన్ : ఎక్కువ కాలుష్య పరిధిలో నివసించే వారికి డైసన్ ప్యూర్ కూల్ ఎయిర్ ప్యూరిఫయర్ మంచి గ్యాడ్జెట్. స్మార్ట్ ఫీచర్లను కలిగిన ఇది గదిలోని గాలిని శుభ్రపరచడంలో కీలకంగా పని చేస్తుంది. హెపా ఫిల్టర్ టెక్నాలజీ కలిగి ఉంది, వైఫైతో స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. గాలిలోని హానికర సూక్ష్మజీవులను స్వీకరించి నాశనం చేస్తుంది.
ఎయిర్‌బాక్స్ : అత్యాధునిక ఎయిర్ ఫిల్టర్. బాత్రూముల్లోని సూక్ష్మజీవులు మొదలుకొని రసాయనిక రంగుల్లోని హానికారక కాలుష్యాల వరకూ అన్నింటినీ ఇట్టే పీల్చేసుకుని స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అప్పుడప్పుడూ ఇందులోని ఫిల్టర్‌ను బయటకు తీసి శుభ్రం చేసుకోవడం ఒక్కటే మనం చేయాల్సిన పని. యూవీ ఎల్‌ఈడీ లైటు సాయంతో ఓ నానో రియాక్టర్ హానికారక రసాయన కణాలను ధ్వంసం చేస్తుంది.
ఫిలిప్స్ : కలుషితమైన గాలిని స్వీకరించి స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది ఫిలిప్స్ ఎయిర్ ప్యూరీఫయర్. ఆస్థమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు దీన్ని ఉపయోగించడం ద్వారా కాస్త ఉపశమనం పొందవచ్చని కంపెనీ చెప్తోంది. గాలిలోని హానికర కణాలను 99శాతం తొలగిస్తుంది ఈ ఫ్యూరిఫయర్. నైట్‌మోడ్, డే మోడ్, దీని పరిధిలోని గాలి ఎంత స్వచ్ఛంగా ఉందనేది కూడా చూపించే ఫీచర్లను కలిగి ఉంది. ఇలాంటి ఎన్నో రకాల ఎయిర్ ప్యూరీఫయర్లు అమెజాన్, ఫ్లిప్‌కార్టు వంటి ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.