Politics

ఏపీలో ఎన్నికల రద్దు కలకలం-TNI ప్రత్యేక కథనాలు

Telugu Political News Roundup Today-Andhra Elections 2020 Cancelled

* స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న హింసాత్మక చర్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.కొన్నిచోట్ల బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగడం దారుణమని వ్యాఖ్యానించింది.విధుల్లో విఫలమైన పలువురు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను తప్పిస్తున్నామని వెల్లడించింది.శ్రీకాళహస్తి, పలమనేరు, డీఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.మాచర్ల సీఐను సస్పెండ్ చేయాలని, తిరుపతి, పలమనేరు, రాయదుర్గం , తాడిపత్రి సీఐలు బదిలీ చేయాలని సూచించింది.  తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది.అవసరమైతే ఈ ప్రాంతాల్లో కొత్త షెడ్యూల్​ను ప్రకటిస్తామని తెలిపింది.

* కరోనా ఎఫెక్ట్‌తో త్వరలో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. 6 వారాల పాటు ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు సీఈసీ ప్రకటించడం జరిగింది. 6 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అయితే.. ఇప్పటి వరకూ ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు.జగన్ తీవ్ర అసంతృప్తి!ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల వాయిదా విషయమై చర్చించడానికి కాసేపట్లో గవర్నర్‌ హరిచందన్‌ను జగన్‌ కలవనున్నారు. ఈ భేటీలో భాగంగా అధికారులపై చర్యలపట్ల గవర్నర్‌కు సీఎం వివరించనున్నారని తెలుస్తోంది. కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేశారని చెప్పడాన్ని ప్రభుత్వం విశ్వసించట్లేదని సమాచారం!. జరిగిన సంఘటనలపై గవర్నర్‌కు జగన్ నిశితంగా వివరించనున్నారని తెలుస్తోంది. అయితే.. ఎన్నికలు వాయిదాపడితే మాత్రం 14వ ఆర్థికసంఘం నుంచి నిధులు రావని ప్రభుత్వం చెబుతోంది.అంతకుముందు కరోనా విషయమై మంత్రి ఆళ్ల నాని, వైద్యాధికారులు, ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్ష అనంతరం నేరుగా గవర్నర్ కార్యాలయానికి జగన్ చేరుకున్నారని తెలుస్తోంది. మరి భేటీలో ఈ విషయాలపైనే చర్చిస్తారా..? లేకుంటే కరోనా విషయంపై చర్చిస్తారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఎన్నికల వాయిదాపై పలు పార్టీల నేతలు తమదైన శైలిలో మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నారు.

* ఎపి ఎలక్షన్ కమీషనర్ రమేష్ కుమార్ కామెంట్స్అత్యవసర పరిస్దితుల్లో కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఉండే హక్కులు రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఉంటాయిపంచాయితీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేయాల్సింది..ఎన్నికలకు కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంటుందని పలు పార్టీలు, సామాజిక సంఘాలు చెప్పాయికరోనా ఎఫెక్ట్ పై పూర్తిస్ధాయిలో విచారణ చేసాం నోటిఫై డిజాస్టర్ గా కరోనాని ప్రధాని పేర్కొన్నారుబ్యాలెట్ పేపర్ వాడడం వల్ల ఓటుకి ఎక్కువ సమయం పడుతుంది..చాలా సేపు క్యూలో నిలబడాలివిధిలేని పరిస్దితుల్లో ఎన్నికల ప్రక్రియను ఆరువారాలు నిలిపివేస్తున్నాంనిలిపివేత మాత్రమే రద్దు కాదుఆరువారాల తరువాత సమీక్ష అనంతరం ఎన్నికలు జరుగుతాయిఆరువారాల తరువాత పంచాయితీల షెడ్యూల్ ప్రకటిస్తాం.ఇప్పటికే ఏకగ్రీవం అయిన వారికి ఎన్నికలు ఉండవు…నామినేషన్ వేసిన వారిని భయబ్రాంతులకి గురిచేయకూడదు..ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలి..గ్రామవాలంటీర్ పై అనేక ఫిర్యాదు వస్తున్నాయి..ఉద్యోగుల వ్యక్తిగత, ఆరోగ్య భద్రత కూడా ముఖ్యం ..కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అన్ని స్కూళ్లు, మాల్స్ మూసేసింది..శ్రీకాళహస్తి ,పలమనేరు డీఎస్పిలను ట్రాన్స్ ఫర్ చేయాలి..శ్రీకాళహస్తి ,పలమనేరు, రాయదుర్గం, పుంగనురు ఇన్సిపెక్టర్లను సస్పెండ్ చేయాలి..ఎంపీపీ, జడ్పీ నామినేషన్స్ లో జరిగిన హింసాత్మక ఘటనలను ఈసీ తీవ్రంగా పరిగణిస్తుంది..నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నట్టు భావిస్తున్నాంఅధికారులు ప్రేక్షక పాత్రను పోషిచడం దారుణం..కొందరి అధికారులపై చర్యలు తీసుకోవాలి..హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుడదని ఆశిస్తున్నాం..అత్యంత హింసాత్మక ఘటనలు జరిగిన గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను విధుల నుండి తప్పించాలి.మాచర్ల ఘటనలో నిందితులకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం హేయమైన చర్య.. సీఐని సస్పెండ్ చేయాలిశ్రీకాళహస్తి, పలమనేరు రాయదుర్గంతిరుపతి, మాచర్ల, పుంగనూరు ఎన్నికలు నిశితంగా గమనిస్తుంది..అవసరమైతే వాటి వరుకు ప్రత్యేకంగా ఎన్నిక నిర్వహిస్తాం.

* తెదేపా అధికార ప్రతినిధి బోండా ఉమా కామెంట్స్మాచర్లలో నామినేషన్ లు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేసేందుకు మాచర్ల పోలీస్ స్టేషన్ కు వెళ్ళాంమాపై దాడి చేసి మమ్మల్ని చంపాలని చూసారుమాపై దాడి జరగడం మీడియా తో ప్రపంచం అంతా చూసిందిఇది పూర్తిగా పోలీస్ వైఫల్యం కాదా ? డిజిపి మా కాల్ డేటా ఎంక్విరీ చేస్తామని మాట్లాడుతున్నారుమాపై దాడి చేసిన వ్యక్తులను వదిలేసి తూతూ మంత్రంగా ముగ్గురిని అరెస్ట్ చేశారుమేము కోర్టుకు వెళ్తామని తెలిసి సెక్షన్ లు మార్చి కేస్ నమోదు చేశామని డిజిపి చెప్తున్నారుమాపై దాడి చేసిన వారిని విచారించరా? మాపై దాడికి పంపించిన వారెవరుఒక పాత బీహార్ ను మరిపించే విధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందిరాష్ట్రంలో అన్ని చోట్లా పోలీస్ ల సహకారంతో తెదేపా నాయకులపై కేస్ లు పెడుతున్నారునిందితులను వదిలేసి బాధితులైన మమ్మల్ని విచారిస్తారా ?

* ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందించారు.భయానక వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగిందని చెప్పారు.భయపెట్టి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని వ్యాఖ్యానించారు.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యనేతల బంధుగణం, వారసులు బరిలోకి వస్తున్నారు.ప్రధానంగా జడ్పీ అధ్యక్ష పదవులు, నగర మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల పదవులకు పోటీ పడుతున్నారు.అధికార పార్టీ నుంచి బంధువులను బరిలో నిలపవద్దన్న సూచనలు ఉన్నా వేరేవారి నుంచి పోటీ లేదనే కారణంతో పలువురు నేతలు తమ బంధుగణాన్ని బరిలో నిలిపారు.శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌.. జడ్పీ అధ్యక్ష స్థానమే లక్ష్యంగా తన భార్య వాణిని టెక్కలి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించారు. టెక్కలిలో పోటీచేసి ఓడిన తిలక్‌ భార్య భార్గవి, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కుమారుడు కృష్ణచైతన్య, ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ కూడా జడ్పీటీసీ బరిలో ఉన్నారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కుమార్తె మాన్విత జడ్పీటీసీ బరిలో నిలిచారు.పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సోదరి జడ్పీటీసీ బరిలో ఉన్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ బంధువు లక్ష్మీజ్యోతి జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి కోసం కౌన్సిలర్‌గా పోటీ చేశారు.గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు కోటయ్య, నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తమ్ముడు విజయకుమార్‌రెడ్డి భార్య అరుణ జడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి గురి జడ్పీ పీఠంపైనే.అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి (వైకాపా) కుమార్తె నైరుతమ్మ, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ అన్న కొడుకు పవన్‌గౌడ్‌ (తెదేపా) కౌన్సిలర్‌ స్థానాలకు పోటీ పడుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కోడలు శ్రీలక్ష్మి అవుకు జడ్పీటీసీ సభ్యురాలిగా (వైకాపా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి (వైకాపా) కుమారుడు అభినయ్‌రెడ్డి కార్పొరేటర్‌గా, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (వైకాపా) కుమారుడు మోహిత్‌రెడ్డి ఎంపీటీసీగా, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి భార్య పరంజ్యోతి కార్వేటినగరం జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.విజయవాడ మేయర్‌ పదవి కోసం ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత కార్పొరేషన్‌ బరిలోకి దిగారు. జడ్పీ ఛైర్మన్‌ స్థానమే లక్ష్యంగా డీసీసీబీ ఛైర్మన్‌ ఉప్పాల రాంప్రసాద్‌ కోడలు హారిక పెడన జడ్పీటీసీ స్థానానికి నామినేషన్‌ వేశారు.విజయనగరం జిల్లా మెరకముడిదాం జడ్పీటీసీ పదవికి పోటీచేసిన మజ్జి శ్రీనివాస్‌.. మంత్రి బొత్స మేనల్లుడు. ఇక్కడ తెదేపా నుంచి నామినేషన్‌ వేసిన మహిళ తర్వాత వైకాపాలో చేరడంతో శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జడ్పీ పీఠంపై గురిపెట్టినట్లు సమాచారం.అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (వైకాపా) కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి మున్సిపాలిటీ ముఖ్యస్థానమే లక్ష్యంగా కౌన్సిలర్‌ స్థానానికి బరిలో దిగారు. ఇదే స్థానానికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన న్యాయవాదుల ద్వారా నామినేషన్‌ దాఖలు చేయించారు.

* మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్…..అభ్యర్థుల పూర్తి బాధ్యత నాదే వారికి ఏమైనా జరిగితే బీజేపీకే రాజీనామా చేస్తా…రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు అధికంగా పోటీచేసిన ఏకైక నియోజకవర్గం జమ్మలమడుగు….అభ్యర్థులు వారి భద్రత కోసమే దేవగుడికి వచ్చారు…అభ్యర్థులను వైస్సార్సీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు….

* ఈసీ ఏకపక్ష నిర్ణయాల పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసంతృప్తి..ఎటువంటి విచారణ చేయకుండా అధికారులను బదిలీ చేయడం పై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్..ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను 6 వారాలు వాయిదా వేయడం గవర్నర్ కి ఫిర్యాదు చేయనున్న జగన్..

* స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వెలిబుచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా జరిగిన దౌర్జన్యకాండకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి.90 శాతం స్థానిక సంస్థలను గెలవాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చెప్పటమే ఈ దౌర్జన్యాల కు కారణం.కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ తొలుత నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సిపిఐ తరపున జల్లి విల్సన్ కోరటం జరిగింది.మళ్లీ తిరిగి నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల నిర్వహణ ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.

* ఎన్నికల ప్రక్రియను మొత్తం రీషెడ్యూల్ చేయాలని తెదేపా డిమాండ్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెదేపా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదని ఆరోపించారు.విజయవాడలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్​బాబు, బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. వైకాపా ఉచ్చులో కొందరు అధికారులు పడ్డారని ఆరోపించారు.వారిపై విచారణ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.డోన్‌, మాచర్లలోనూ తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్‌ వేయనివ్వలేదని దీపక్ రెడ్డి అన్నారు.నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని అన్నారు.తాము చేసిన ఫిర్యాదులు అన్నింటిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

* టీడీపీ సీనియర్ నేత,గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కామెంట్స్:రాష్ట్రంలో మరియు గురజాల నియోజకవర్గంలో వైసిపి అరాచకాలు తారాస్థాయికి చేరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారుగురజాల నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థులు అందర్నీ పోలీసులు బెదిరించారునామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే గంజాయి కేసులు,తప్పుడు కేసులు,ఎన్కౌంటర్లు చేస్తామని బెదిరించి నామినేషన్లను విత్ డ్రా చేయించారుఈ అరాచకాల పైన హైకోర్టులో కేసు వేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామువైసిపి అరాచకాలను ప్రజలందరికీ తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాంఇప్పుడు నామినేషన్ వేసి పోలీసుల ఒత్తిడితో విత్ డ్రా చేసుకున్నా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వీటి కన్నా మంచి పదవులు కట్టపెడతాం.తప్పకుండా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అండగా ఉంటాం

* స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపైభీమవరంలో విలేఖర్ల సమావేశం నిర్వహించిన జిల్లా బిజెపి నేతలుమాజీ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కా పాక సత్యనారాయణ తదితర నేతల హాజరురేపు జిల్లా కేంద్రాలు, మరియు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, తాలూకా కేంద్రాల వద్ద బిజెపి, జనసేన ధర్నాలురాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్త చేతనావస్తలో ఉంచి, కేంద్ర ప్రభుత్వ బలగాల సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిజెపి డిమాండ్నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు ఘర్షణలతో అవకతవకలు జరిగినందున రద్దు చేయాలని డిమాండ్ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా రద్దు చేసి, మరల కొత్త ప్రకటనతో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి.

* విడిది కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం.ఏపీలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు సీఎం జగన్ ఇటువంటి పరిస్థితి వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చింతించాల్సిన అవసరం ఉంది సీఎం జగన్చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను నీరుగారుస్తున్నారు.కరోనా వైరస్ పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదుమన దేశంలో పుట్టింది కాదుకరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందికరోనా భయానకం ఏమి కాదుకేవలం రెండు మూడు వారాల్లో పరిస్థితి మారిపోదునిరంతర ప్రక్రియగా ఏడాది పాటు జరగాల్సి ఉందిజాగ్రత్తలు తీసుకుంటూనే దైనందిన జీవితం కొనసాగాలివిశాఖపట్నంలో 200, విజయవాడలో 50 పడకల వార్డులు సిద్ధంగా ఉన్నాయిగ్రామ వాలంటీర్లతో ప్రతి ఇల్లు సర్వే చేస్తున్నాంవిచక్షణ కోల్పోయి ఎన్నికల కమిషనర్ వ్యవహరించారుఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయికులాలు మతాలకు అతీతంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలిఒకవైపు కరోనా ఎఫెక్టుతో ఎన్నికలు వాయిదా అంటూనే అధికారులను తప్పిస్తూ వ్యాఖ్యలు చేశారుమరోవైపు కలెక్టర్లు అధికారులను బదిలీ చేయటం ఎంతవరకు సబబురమేష్ కుమార్ కు ఇలా వ్యవహరించే అధికారం ఎక్కడిదిఅధికారం ముఖ్యమంత్రిదా?.. ఈసీదా..?ఎవరో రాస్తున్నారు ఎవరో ఆర్డర్ ఇస్తున్నారు ఆ ఆర్డర్ను ఈయన చదువుతున్నారుఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా..?కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రెటరీ ని పిలిచి ఎందుకు అడగలేదుచివరకు పేదలకు ఇళ్ల పట్టాల ప్రక్రియను కూడా ఆపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారుప్రజలు ఓట్లు వేసి 151 స్థానాలు ఇస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చిందిఇంత వివక్ష చూపటం ధర్మమేనా, ఇది సరైందేనాచంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్ష

* ఈసీ రమేష్ కుమార్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్రమేష్ కుమార్ పై కేంద్రం, సీఈసీకి ఫిర్యాదు చేయనున్న రాష్ట్ర. ప్రభుత్వంరమేష్ కుమార్ పై పార్టీ పరంగా కాకుండా, ప్రభుత్వ పరంగా ఫిర్యాదుటీడీపీకి అనుకూలంగా రమేష్ కుమార్ వ్యవహరించారంటూ ఆరోపణలుకరోనా పేరిట ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారనే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న ఏపీ సర్కార్.

* బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లకు లేఖ రాశారు. బీజేపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. పలు చోట్ల దాడులతో భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరం అని అభివర్ణించారు. పోలీసుల అండతోనే వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారని కన్నా ఆరోపించారు. బీజేపీ నేతల ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించిందని, విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకుందని వెల్లడించారు. అవసరమైన చోట కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని ఈసీ తెలిపిందని వివరించారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని, 6 వారాల తర్వాత ఎన్నికలను పారదర్శకంగా జరపాల కోరారు.