Movies

కొరోనా ప్యార్‌హై సినిమా అంట

Indian Movie Producers And Directors Registering Titles On Coronavirus

ఓ వైపు కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు పోరాడుతుంటే మరోవైపు ఈ టైటిల్‌తో సినిమాలు తీయడానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. దీంతో ఆ పేరు వచ్చేట్టుగా సినిమా టైటిళ్లను నమోదు చేయిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ ఈ విషయంలో ముందుంది. ‘కరోనా ప్యార్‌ హై’ టైటిల్‌ను నమోదు చేయించుకుంది. అంతేకాదు దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా మొదలెట్టేశారు. ‘ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఓ ప్రేమకథగా సినిమాను తీయబోతున్నారు. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మొదలుపెడతాం’ అని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి తెలిపారు. మరికొందరు నిర్మాతలు సైతం కరోనా పేరుతో కూడిన టైటిల్స్‌ను నమోదు చేసుకున్నారని ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పేర్కొంది. ఇంకోవైపు కరోనా ఎఫెక్ట్‌ వల్ల ఇప్పటికే పలు సినిమాల విడుదల తేదీలు వాయిదా పడ్డాయి. ‘వి’, ‘సూర్యవంశీ’, ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ వంటి చిత్రాల్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. అంతేకాదు సినిమా షూటింగ్‌లను కూడా ఆపేశారు. ఇప్పటికే విడుదలైన ‘బాఘి 3’, ‘అంగ్రేజీ మీడియం’ సినిమాలకు బాక్సాఫీసు వద్ద తిప్పలు తప్పలేదు.