దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.54గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 2,350 పాయింట్లు దిగజారి.. 31,757 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 666 పాయింట్లు దిగజారి 9,292 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు కొనసాగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రభావమే దేశీయ మార్కెట్లపైనా కొనసాగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 110 మందికి పైగా కరోనా సోకడంతో పాటు మరో ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.26 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో యెస్ బ్యాంక్, హిందుస్థాన్ పెట్రోలియం, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఇండస్‌ఇండ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
2300 పాయింట్లు ఢమాల్
Related tags :