భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ అయ్యారు. నామినేటెడ్ సభ్యుల పదవీ విరమణ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనను నామినేట్ చేస్తున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు న్యాయవ్యవస్థలో కొద్దిమంది మాత్రమే చట్టసభల్లో సభ్యులుగా అవకాశం పొందారు. గతంలో మాజీ చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్లో చేరి పార్లమెంటులో సభ్యత్వం పొందారు. ఆ తర్వాత సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం సైతం కేరళకు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా జస్టిస్ రంజన్ గొగోయి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యారు. సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన ఆయన గతేడాది నవంబర్లో పదవీ విరమణ చేశారు. 2018 అక్టోబర్లో సీజేఐగా బాధ్యతలు స్వీకరించి తన పదవీ కాలంలో ఎన్నో సంచలన కేసుల్లో తీర్పులు వెలువరించారు.
రాజ్యసభ ఎంపీగా మాజీ సీజేఐ రంజన్ గొగొయ్
Related tags :