అందరూ ఎదుర్కొనే సమస్య పులిపిర్లు. ఇవి ఏర్పడటానికి ప్రధానకారణం వైరస్. కొందరు వీటిని గిల్లడం, లాగడం వంటివి చేస్తుంటారు. దానివల్ల కొత్తచోట్లలోనూ పులిపిర్లు ఏర్పడతాయి. ఇవి చర్మం రంగులో కానీ, కాస్తంత ముదురు గోధుమరంగులోగానీ బుడిపెల మాదిరిగా, నున్నగా, గరుకుగా ఉంటాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, కాళ్లు మొదలైన ప్రదేశాల్లో వస్తుంటాయి.బంగాళదుంపను మధ్యకు కోసి ఆ ముక్కతో రుద్దుతూ ఉండాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే పదిహేను రోజుల్లో పులిపిర్లు ఎండిపోయి, రాలిపోతాయి.పులిపిర్లకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. చుక్క ఆముదాన్ని పులిపిరిపైన వేసి, స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండుపూటలా మూడువారాలు చేస్తే, మంచి ఫలితం ఉంటుంది. పులిపిరుల నివారణకు వెల్లుల్లిపాయలను ఒలిచి, పులిపిరులపై రుద్దుతూ ఉండాలి. ఉల్లిపాయను సగానికి కోసి, మధ్యభాగాన్ని తొలగించి, అందులో ఉప్పు నింపాలి. దీని నుంచి వచ్చే రసంతో పులిపిరుల పైన సున్నితంగా రుద్దాలి. ఇలా దాదాపు నెలరోజుల పాటు చేస్తుండాలి. అరటిపండు తొక్కను తీసుకుని గుజ్జు భాగం పులిపిరుల పైన ఆనేట్లుగా ఉంచి, స్టికింగ్ ప్లాస్టర్తో అతికించాలి. రాత్రంతా ఉంచి, ఉదయాన్నే తీసేయాలి. ఇలా కనీసం వారంరోజులు చేయాలి. ఆ తర్వాత మంచి ఫలితం కనిపిస్తుంది.
పులిపిర్ల సమస్యా?
Related tags :