Health

కొరోనా లక్షణాలు ఇవి-TNI ప్రత్యేకం

You must have fever to consider corona

* హైదరాబాదు నుండి ఆఫ్ఘనిస్తాన్ ఫిలిఫైన్స్ మలేషియా విమానాలను నేటి నుండి రద్దుచేశారు.

* కరోనాను ఇలా గుర్తించొచ్చు. కరోనా క్లినికల్ ఫీచర్స్ ను విడుదల చేసిన AIIMS. జ్వరం (83%), దగ్గు (82%), శ్వాస ఆడకపోవడం (31%), గొంతు నొప్పి (5%), ముక్కె ,గొంతు నుంచి కెళ్ల..పస (4%), విరేచనాలు (2%), ఊపిరితిత్తుల్లో నీరు చేరటం న్యుమోనియా (75%), గాలిపీల్చుకోవడంలో కష్టం( 10-17%).

* ఇటలీలో గత రెండు రోజుల నుండి 7 17మంది మృతి చెందారు ఇప్పటివరకూ ఈ దేశంలో రెండు వేల 158 మంది మృతిచెందారు

* అమెరికాలో తొలిసారిగా 43 ఏళ్ల మహిళపై కరోనా నిరోధక వ్యాక్సిన్ ఉపయోగించారు

* ముంబై లో మూడు సంవత్సరాల బాలికకు కరోనా వైరస్ కలకలం రేపింది మహారాష్ట్రలో 64 ఏళ్ళ వ్యక్తి కరోనా వైరస్ తో మృతి చెందాడు

* ఇప్పటివరకూ ఇండియాలో 63 ప్రదేశాలలో నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేశారు

* కరోనా వైరస్ ప్రభావం నుంచి దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో మృత్యుంజయ హోమం. పాశుపత హోమాన్ని నిర్వహిస్తున్నారు. దేవాదాయశాఖ ఆదేశాలతో శ్రీశైలం ఆలయంలో జపాలు, హోమాలు ప్రారంభించామని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు.. జపాలు 40 రోజుల పాటు సర్కారి సేవగా దేవస్థానం నిర్వహిస్తుందని ఈవో తెలిపారు.

* ఏప్రిల్ 2న జరిగే నవమి వేడుకకు భక్తులు రావద్దు. 18 వేల టికెట్లలో వెయ్యి తొంభై మాత్రమే అమ్మకం జరిగాయి. మిథిల స్టేడియం లో జరుగుతున్న పనులు నిలిపేసాం. భక్తులను రావద్దొని కోరుతున్నాం. రాములోరి కళ్యాణం అధికారులు , అర్చకుల మధ్య మాత్రమే జరుగుతుంది. కళ్యాణాన్ని చూడలేనందున భక్తులు బాధ పడొద్దు.

* మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులు దర్శనానికి రాకూడదని తెలిపారు.

* కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలకూ ఈ వైరస్ పాకడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయ సిబ్బంది కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. టీడీపీ కార్యాలయంకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తోంది. స్క్రీనింగ్ చేశాకే టీడీపీ ఆఫీసులోకి సిబ్బంది అనుమితిస్తోంది.

* కరోనా వైరస్‍పై టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో అప్రమత్తత.అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు రావొద్దని పిలుపు.పార్టీ కార్యాలయానికి వస్తున్న చంద్రబాబు సహా అందరికి థర్మల్ స్కానింగ్100 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత నమోదైన వారిని కార్యాలంలోకి అనుమతించరాదని నిర్ణయం.స్కానింగ్ తర్వాతే కార్యాలయం లోపలికి నేతలు, కార్యకర్తలను అనుమతిస్తున్న సిబ్బంది.కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జగ్రత్తలను సిబ్బందికి వివరించిన చంద్రబాబు.

* ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు వ్యక్తులు మధ్య మాటలు జరిగిన ప్రస్తుతం తొలి ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కరోనాప్రస్తుతం అన్ని దేశంలో ఈ కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ప్రభుత్వ వర్గాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేస్తూన్నారు.మరోవైపు మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఈ వైరస్ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారు అనే సమాచారం అందుకున్న అధికారులు అసలు అది కరోనా నా లేక మాములు లక్షణాలా అనే క్షణంగా పరిశోదనలుదీని ఎఫెక్ట్ ప్రస్తుతం రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశంలో, ఎక్కువ మంది ప్రజలు కలిసే ప్రాంతంలో ఉంటుందని వైద్యులు తెలియజేస్తూన్నారు.పలు విధ్యా సంస్థలు సైతం శెలవు దినాలు ప్రకటించినారుఈ వైరస్ దెబ్బకు అటు వ్యాపార సంస్థలు, సెన్సెక్స్, స్టాక్ మార్కెట్ లపై ప్రభావం చూపుతోంది.

* కరోనాపై స్పందించిన ప్రధాని.ఎంపీలు తమ నియోజక వర్గాల్లో పర్యటించాలని పిలుపు.కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల అవగాహన కల్పించాలని సూచన.ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో కరోనా వైరస్‌ ప్రభావంపై కూడా పలువురు నేతలు మాట్లాడారు. ప్రధానమంత్రి నరంద్ర మోదీ ఈ విషయంపై మాట్లాడుతూ ఎంపీలకు పలు సూచనలు చేశారు.

* కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలుకరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌వైరస్‌ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలుమాస్క్‌లు, శానిటైజర్ల కొరత రానివ్వంఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు.అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.కరోనా వైరస్‌(కొవిడ్‌-19) నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు.14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామన్నారు.

*