ఓవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ కట్టడిపై దృష్టిసారిస్తే చిరకాల వైరివర్గాలు అమెరికా, చైనా మాత్రం పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కరోనాను ‘చైనీస్ వైరస్’గా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాటల్ని సమర్థించుకున్నారు. ‘కరోనా’కు అమెరికాయే కారణమంటూ చైనా నిందలు వేయడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం వల్లే వైరస్ చైనాకు పాకిందనడం తప్పుడు ఆరోపణ అని అన్నారు. అయితే, ఈ క్రమంలో అది ఎక్కడ నుంచి వచ్చిందో.. దాని పేరు పెట్టి పిలవడం ఏమాత్రం తప్పుకాదన్నారు. ‘చైనీస్ వైరస్’ అని వ్యవహరించడం సరైన పదమేనన్నారు. చైనాకు ప్రయాణాలను నిషేధించి తాను మంచిపని చేశానని వ్యాఖ్యానించారు. అయితే, చైనాతో విభేదాల వల్ల ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిసరకు దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనను ట్రంప్ కొట్టపారేశారు. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన తొలిదశ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘిస్తుందని తాను భావించడం లేదన్నారు. చైనాకు అమెరికా ఉత్పత్తులు చాలా అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సత్సంబంధాలను చైనా కొనసాగిస్తుందని జోస్యం చెప్పారు. చైనాలో కంటే ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ఉద్ఘాటించిన రోజునే అమెరికా-చైనాలు పరస్పరం విమర్శలకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Its’ not corona or covid19. It’s Chinese virus.
Related tags :