రకుల్‌ప్రీత్‌సింగ్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో 13 మిలియన్ల అభిమానులు ఈ అమ్మడిని ఫాలో అవుతున్నారు. కాగా రకుల్ తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. రకుల్‌ప్రీత్‌సింగ్ ఫొటోలను చూసిన కొందరు అభిమానులు చాలా అందంగా ఉన్నావంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. రకుల్ ఫోజులను చూసి విమర్శిస్తున్న వారు ఉన్నారు. కొందరు చేసే అసభ్యకరమైన కామెంట్లు మనసును బాధిస్తాయని రకుల్ చెప్పింది. మహిళలను భోగవస్తువుగా చూసే సమాజం దృష్టి మారాలని అంది. అలా ఒక నెటిజన్ తన ఫొటో చూసి చొక్కా మాత్రమే ధరించి ఫోజు ఇచ్చారు. కింద ఏమీ ధరించలేదా అని కారులో ఉల్లాసంగా ఉండి అలానే బయటకు వచ్చారా? అని చాలా అసభ్యంగా కామెంట్ చేశారని చెప్పింది. దీంతో కోపం తన్నుకొచ్చిన తాను అంతే స్ట్రాంగ్‌గా మీ అమ్మ అలా చేసి ఉంటుందని, అందుకే దాన్ని తలచుకుని నన్ను కామెంట్ చేశావు అని బదులిచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి కామెంట్లు చేసే వారిలో చాలా వరకు నకిలీ ఫేస్బుక్ ఐడీలనే వాడుతుంటారన్నారు. అసలు ముఖాలను చూపడానికి ధైర్యం లేని పిరికివారే అసభ్యంగా కామెంట్స్ చేస్తుంటారని అంది. ఇలా నకిలీ ఫేస్బుక్ ఐడీలను రూపొందించలేని విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పుడే ఇలాంటి పోకిరోళ్ల కామెంట్లను అరికట్టడం సాధ్యం అవుతుందని రకుల్ అంటోంది.
ఒళ్లుమండింది. అమ్మను తిట్టింది.
Related tags :