రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సంస్థలు, నర్సింగ్ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. ఈనెల 23 వరకు ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెలవుల దృష్ట్యా విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈనెల 31 తర్వాత మళ్లీ సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు.
ఏపీలో ఆగని పది ఇంటర్ పరీక్షలు
Related tags :