కొరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య చైనా కన్నా ఇటలీలో అధికంగా ఉంది. ఇప్పటివరకు చైనాలో 3249 మంది మృతి చెందగా, ఇటలీలో 3405 మంది మరణించారు. ఒక్క గురువారం నాడే 427మంది ఇటలీలో ఈ వైరస్ బారిన పడి కన్నుమూశారు. 2020 ఆరంభంలొ చైనాలోని వూహాన్‌లో మొదలైన ఈ మహమ్మారి ఐరోపా దేశాలకు విస్తరించింది. ఈ క్రమంలో ఇటలీలోకి ప్రవేశించిన ఈ వైరస్ ఫ్యాషన్ రాజధాని అయిన మిలాన్ ఉన్న ఉత్తర లాంబర్డీ ప్రాంతంలో తన పంజా విసిరింది. ఇటలీ దేశంలో ప్రస్తుతం అత్యయిక పరిస్థితి నడుస్తోంది.
చైనా కన్నా అధికంగా ఇటలీలో కొరోనా మృతులు
Related tags :