* కరోనా లక్షణాలతో 57 ఏళ్ల వ్యక్తి గుంటూరులోని ఐడీ ఆసుపత్రిలో చేరిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా కాగా ఇటీవలే సదరు వ్యక్తి హైదరాబాద్ వెళ్లి వచ్చాడు.వ్యక్తి నమూనాలు తీసి వైద్యులు పరీక్షల నిమిత్తం తిరుపతికి పంపారు.మంగళగిరి నుంచి కరోనా లక్షణాలతో వచ్చిన జంటకు నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిద్దరినీ ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
* కరోనాను తొలిగా గుర్తించి అప్రమత్తం చేసిన వైద్యుడు లి వెన్లియాంగ్ (34) విషయంలో తమ ప్రవర్తన తప్పని చైనా అంగీకరించింది. వైద్యుడి కుటుంబానికి వూహాన్ పోలీసులు క్షమాపణ చెప్పారు. ఏడుగురు వ్యక్తుల్లో ‘సార్స్’ను పోలిన వైర్‌సను తాను గమనించినట్లు డిసెంబరు 30న ‘వి చాట్’ గ్రూప్‌లో లి షేర్ చేశాడు. కానీ, దీనిపై పోలీసులు అతడిని హెచ్చరించారు. జనవరి 10న లిలో కరోనా లక్షణాలు కనిపించాయి. తాను వైరస్ బారినపడ్డట్లు ప్రకటించిన కొద్ది రోజులకే చనిపోయాడు. అతడి మరణం చైనాలో సంచలనమైంది.
* సచివాలయంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రత్యేక చర్యలుకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సచివాలయంలో ప్రభుత్వం శానిటైజర్లు ఏర్పాటు చేసింది.సచివాలయంలోని అన్ని బ్లాకుల్లోనూ సిబ్బంది శానిటైజర్లతో చేతులు శుభ్రపర్చుకున్న తర్వాతే లోపలికి వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.అన్ని విభాగాల్లోనూ ఉద్యోగులు దూరంగా కూర్చుని విధులు నిర్వహించాల్సిందిగా సూచించారు.ఇప్పటికే సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు నిలిపివేశారు. రిజిస్టర్లో సంతకాలు తీసుకోవాలని సెక్షన్ అధికారులకు ప్రభుత్వం సూచించింది.
* కరోనా వైరస్ ధాటికి ఇటలీ చిగురుటాకులా వణుకుతోంది.వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇప్పటికే 3,405 మంది మృతి చెందగా.. 41,035 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో కరోనా మృతులు అత్యధికంగా నమోదైన దేశంగా ఇటలీ తొలిస్థానంలో నిలవగా.. చైనాలో 3242 మంది వైరస్ కారణంగా కన్నుమూశారు.మరోవైపు శుక్రవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా వైరస్ మృతుల సంఖ్య పదివేలకు చేరింది.ఇక కోవిడ్‌తో ఇటలీలోని ప్రముఖ నగరాల్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏ ఒక్కరూ బహిరంగ ప్రదేశాలకు రావడంలేదు.వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనాలు బయటకురావడానికి జంకుతున్నారు.గత ఇరవై రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని కార్యాలయాలు, మాల్స్, విద్యాసంస్థలు మూసివేయడంతో ఇటలీ వీధుల్లో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
* విజయవాడలో తొలి కరోనా అనుమానిత కేసు…??ఇటీవలే పారిస్ నుంచి ఢిల్లీ మీదుగా నగరానికి చేరుకొన్న యువకుడు…నగరంలోని వన్‌టౌన్, మేకలవారి వీధికి చెందిన వ్యక్తిగా గుర్తింపు… ఫుల్ సూట్ లో వచ్చిన వైద్య ఆరోగ్య సిబ్భంది అనుమానిత వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు…పారిశుధ్య కార్మికులు ఆ వీధి మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు…
* ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. దీని వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పదివేల మందికిపైగా మరణించారు.భారత దేశంలో కూడా 214మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో 19మంది కోలుకున్నారు.ఈ క్రమంలో ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై అవగాహన పెంచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి.దీనికోసమే కరోనా హెల్స్‌లైన్ నంబర్లను ప్రకటించాయి.ఈ నేపథ్యంలో ఇకపై వాట్సాప్‌లోనూ కరోనా వివరాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఓ వాట్సాప్ చాట్‌బోట్‌ను సిద్ధం చేసింది.కరోనా వైరస్ గురించి కావలసిన సమాచారమంతా ఈ బోట్ ద్వారా తెలుసుకోవచ్చు.కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, క్వారంటైన్‌కు సంబంధించిన వివరాలు అన్నీ ఈ బోట్ ద్వారా తెలుస్తాయట.ఈ బోట్ పేరు ‘మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్’.. మీరు కూడా వాట్సాప్‌లో కరోనా వివరాలు తెలుసుకోవాలంటే.. 90131 51515 నంబరును మొబైల్లో సేవ్ చేసుకుంటే చాలు.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాదినాడు పేదలకు పంపిణీ చేయాలని తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14కు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు.
* కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వాటిని ప్రజలందరూ పాటించాలని ఆయన కోరారు. ఈ నెల 22న మోదీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూ పాటించాలని అన్నారు. కరోనా మహమ్మారి ప్రమాదకరమని తెలిసినప్పటికీ సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
* నల్లగొండలోనూ ఇండోనేషియా మత ప్రచారకులు పర్యటించనట్టు వార్తలు వినవస్తుండటంతో, ఒక్కసారిగా అక్కడ కూడా కలకలం రేగింది. 14 మంది మత ప్రచారకులు ఇండోనేషియా, సౌదీ నుంచి రెండు రోజుల కిందట నల్లగొండకు వచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి వారందరినీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.