సహజంగా ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో రోజూ జరిగే జీవక్రియలతో విషాలు చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించడానికి అవయవాలు, శరీవ్యవస్థ నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడతాయి. దీని వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా మనలో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడుతాయి. వీటిని మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు..
మీ రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోడానికి మీరు తీసుకోవలసిన మొదటి దశ ఆరోగ్యకరమైన ఆహారం. అయినప్పటికీ, నిర్దిష్ట రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉన్న కొన్ని ఆహారాలతో మీరు ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఫ్లూ వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. కరోనావైరస్, కాలానుగుణ ఫ్లూ భయం నేపథ్యంలో, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, అన్ని ఇన్ఫెక్షన్లను సాధ్యమైనంత వరకూ నివారించడం చాలా ముఖ్యం. మీ రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవాలంటే మీరు చేయాల్సిన మొదటి పని ఆరోగ్యకరమైన ఆహారం. సరైన పోషకాహారం తీసుకోవడాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటారు. లీన్ ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులను సమానంగా తీసుకోవాలి. వీటన్నింటినీ బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాలి. దీంతో శరీరం బలంగా తయారవుతుంది.
వ్యాధులు దూరం అవుతాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మంచి ఆహారాలు. పిజ్జా, పాస్తా, బర్గర్లు, ఫ్రైస్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. నీరు, పిండి పదార్ధాలు, కూరగాయలు, పండ్లు, ఫైబర్, పాలు, పాల ఉత్పత్తులు, ప్రోటీన్లు ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అయినప్పటికీ, నిర్దిష్ట రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉన్న కొన్ని ఆహారాలతో మీరు ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచే 5 ఆహారాలు..
సిట్రస్ పండ్లు..
[2:13 AM, 3/20/2020] +91 94402 31118: ా
సిట్రస్ పండ్లు.. విటమిన్ సికి ప్రసిద్ధ వనరులు. తెల్ల రక్త కణాలు మీ శరీరాన్ని సాధారణ అంటువ్యాధులు, వ్యాధుల నుండి రక్షిస్తాయి. కానీ, శరీరం వాటిని ఉత్పత్తి చేయలేకపోతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటారు. కాబట్టి, విటమిన్ సి పెంచడానికి రోజూ ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను తీసుకోండి. సిట్రస్ పండ్లు జాతిలోకి ఆరెంజెస్, నిమ్మరసం, గ్రేప్స్, సిట్రస్, బెర్రీస్ మొదలైన పండ్లు అన్ని కూడా ఈ కోవలోకే వస్తాయి. సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి, ముఖ్యమైన న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి అద్భుతంగా సాయపడుతాయి. విటమిన్ సి వ్యాధుల బారినపడకుండా రోగనిరోధకతను పెంచడానికి, వ్యాధులతో పోరాడటానికి సాయపడుతుంది.
బ్రోకలీ
ఆకుపచ్చ రంగు కూరగాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలలో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్రోకలిని గొప్ప ఆహారంగా చెప్పొచ్చు. బ్రోకలీ శరీర నుంచి విషపదార్థాలను మొత్తం కూడా బయటకు పంపిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. బ్రోకలీని రోజూ తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వంటకి మంచి సువాసన ఇవ్వడం మాత్రమే కాదు. జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి, వ్యాధినిరోధకతను ఎదుర్కోవడానికి బ్లెడ్ సెల్స్ ను పెంచుతుంది. వీటిలో అలిసిన్, అజోయేన్, థయోసల్ఫేట్ వంటి పదార్థాలు ఇన్ఫెక్షన్స్‌తో పోరాడి వివిధ రకాల వైరస్‌లను చంపేస్తుంది. ఇది రక్తపోటును సరైన విధానంలో ఉంచి.. ధమనుల గట్టిపడకుండా నిరోధించడానికి సాయపడుతుంది. అప్పటి కాలంలో బ్యాక్టీరియా సంక్రమణ, ఫ్లూ నుండి బయటపడటానికి వెల్లుల్లిని ఉపయోగించొచ్చు.
అల్లం..
అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వకాలం నుంచి చెబుతున్నారు. అల్లంని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. అల్లంలోని ప్రత్యేక సమ్మేళనం దగ్గు, గొంతు నొప్పి, ఇతర అనారోగ్యాలకు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, స్థిరీకరించడానికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది.
పసుపు..
నిత్యం ఇంట్లో వంటల్లో ముఖ్యమైనది పసుపు. పసుపు లేకుండ వంటలు చేయడానికి కుదరదు. పసుపు వంటలే కాదు ఆరోగ్యానికి, అందాన్ని కాపాడాటానికి కూడా చక్కగా పనిచేస్తుంది. పసుపును ఎన్నో రోజులుగా అంటువ్యాధులతో పోరాడటానికి ఉపయోగించే వారు. పురాతన మందుల్లో ఎక్కువగా ఉండే కర్కుమిన్ సమ్మేళనం అధికంగా పసుపులో ఉంటుంది. అదే విధంగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయని రుజువు అయ్యింది. కడుపులో మంట చాలా రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆ మంటతో పోరాడేందుకు పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు గుండె జబ్బులు, కాన్సర్, అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో కూడా పసుపు చాలా బాగా సహాయపడతాయి. నివారణ కంటే నిరోధన మంచిది -ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ అనే మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి, ఈ హెల్దీ ఫుడ్ తీసుకుని మీరు కూడా ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండండి..