WorldWonders

సెల్ఫీ. రైల్వే పట్టాలు. ప్రేమ. ఆత్మహత్య.

Young love couple commits suicide on railway tracks in Tamilnadu

తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరు సమీపం సామరసికుప్పంకు చెందిన కోదండన్‌ కుమారుడు రామదాస్‌ బెంగుళూరులో కూలీపనులు చేస్తున్నాడు. ఆలంగాయం సమీపం పూంగులమ్‌పుదూర్‌కు చెందిన నారాయణస్వామి కుమార్తె నందిని కోవైలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన వీరు ప్రేమికులుగా మారారు. ఏడాది క్రితం నందిని వివాహం కాగా, భర్తతో ఏర్పడిన విభేధాల కారణంగా ఒంటరిగా నివసిస్తున్నట్లు రామదాస్‌కు తెలిసింది. అనంతరం ఆమెను కలిసిన రామదాస్‌ ఆమెను ఓదార్చి, ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరు వేర్వేరు వర్గాలకు చెందిన వారు కావడంతో వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో, రామదాస్‌ తన ప్రియురాలు నందినితో కలసి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆంబూరు సమీపంలోని ఊడల్‌ అటవీ ప్రాంతంలో ఉన్న వీవవర్‌ ఆలయంలో తాను నందినిని వివాహం చేసుకోనున్నట్లు తన సోదరికి రామదాస్‌ ఫోన్‌ ద్వారా తెలిపాడు. దీంతో, ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట వీరవర్‌ ఆలయ సమీపంలోని రైలుపట్టాలపై పడుకొని సెల్ఫీ తీసుకున్నారు. ఆ సమయంలో ఆ మార్గంగా వచ్చిన రైలు కిందపడి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం రైలుపట్టాలపై ఇరువురి మృతదేహాలను గుర్తించిన కొందరు జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆంబూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.