పంజాబీ సోయగం తమన్నాను అభిమానులు మిల్కీబ్యూటీ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. పాలకడలిలో స్నానమాడి అప్పుడే భువిపై అరుదెంచిన అందాల రాశి అంటూ కితాబిస్తుంటారు. కెరీర్ ఆరంభం నుంచి నేటి వరకు వన్నెతరగని అందంతో వెలిగిపోతోంది ఈ అమ్మడు. అయితే సీనియర్ కథానాయికలకు ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా పెళ్లి గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నాను ఇదే ప్రశ్న అడగ్గా ఈ భామ చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరచింది. పెళ్లి గురించి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టత నిచ్చిన ఈ సుందరి సమయం వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుందని చెప్పింది. మీకు స్వయంవరం ఏర్పాటు చేస్తే ఏ హీరోలు రావాలని కోరుకుంటున్నారని అడిగినప్పుడు..ప్రభాస్, హృతిక్‌రోషన్, విక్కీకౌశల్ అంటూ సమాధానమిచ్చింది. మరో విషయమేమింటే తమన్నా ఏ సినిమాలోను ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. అలాంటి ఇంటిమేట్ సీన్స్‌లో నటించనని ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. ఇదే విషయం గురించి మాట్లాడుతూ ‘నేను తెరపై ముద్దు సన్నివేశాల్ని అంగీకరించను. ఆ నియమాన్ని స్క్రిక్ట్‌గా ఫాలో అవుతా. అయితే నా పక్కన హృతిక్ ఉంటే మాత్రం తప్పకుండా ముద్దుకు అంగీకరిస్తా’ అని చెప్పింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె అభిమానుల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ముగ్గురితో స్వయంవరం
Related tags :