Sports

ఉమర్ అక్మల్‌పై జీవితకాల నిషేధావకాశాలు

Umar Akmal Could Be Banned For Life From Cricket

పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఉమర్‌ అక్మల్‌పై పాక్‌ క్రికెట్‌ బోర్డు జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. అవినీతి నిరోధక కోడ్‌లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున అతడికి నోటీసులు జారీ చేసింది. ఫిక్సింగ్‌కు సంబంధించిన విషయాలను ఉద్దేశపూర్వకంగా బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయనందున ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మార్చి 31 లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ అక్మల్‌ చెప్పే కారణాలతో పీసీబీ సంతృప్తి చెందకపోతే అతడిపై ఆరు నెలల నుంచి గరిష్టంగా జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.

Image result for umar akmal ban