Sports

టీమిండియా మాజీ క్రికెటర్ సస్పెన్షన్

For sexually abusing women cricketers

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, బరోడా మహిళల జట్టు కోచ్‌ అతుల్‌ బిదేడ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతడిని సస్పెండ్‌ చేశారు. 53 ఏళ్ల అతుల్‌ గతనెల హిమాచల్‌ ప్రదేశ్‌ టోర్నీలో తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పలువురు సీనియర్‌ క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన బరోడా క్రికెట్‌ సంఘం అతడిని సస్పెండ్‌ చేసినట్లు పేర్కొంది. ఈ విషయంపై విచారణ జరుపుతామని ఆ సంఘం అధికారి ఒకరు పీటీఐకు చెప్పారు. అతుల్‌ 1994లో టీమ్‌ఇండియా తరఫున 13 వన్డేలాడి 158 పరుగులు చేశాడు. ఇదివరకు బరోడా పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. గతేడాది మహిళల జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు.