DailyDose

నేటి మీ రాశిఫలం-మార్చి 24 2020

Daily Horoscope Today In Telugu-March 24 2020 Tuesday

తేది : 24, మార్చి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(నిన్న ఉదయం 12 గం॥ 32 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 58 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాభద్ర
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 23 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 19 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : నాగ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 12 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 55 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 42 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 42 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 30 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 11 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 49 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 55 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 52 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 50 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 17 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 27 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : మీనము

మేషం
మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విదేశాలు వెళ్లాలనే కోరిక అధికమవుతుంది. ఊహించని ఖర్చులు అధికం అవడం వల్ల ఆందోళనకు గురవుతారు. నదీ స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. గృహంలో ఏదైన వస్తువు పోయే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి.

వృషభం
కొబ్బరి, పండ్ల, పూలు, పానీయ వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వాహనం కొనాలనే ఆలోచన క్రియా రూపంలో పెట్టండి. మీ ఆత్మీయులు మీ శ్రేయస్సు కోరుకుంటారు. సాంఘిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు.

మిథునం
వాతావరణంలోని మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. మీ కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం అధకమవుతుంది. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. అనుంబంధాల్లో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.

కర్కాటకం
ఆర్థికంగా ఒకడుగు ముందుకు వేస్తారు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది. నూత పరిచయాల వల్ల మీ జీవితం ఊహించని మలుపు తిరుగబోతుంది.

సింహం
కాంట్రాక్టర్లకు అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోవచ్చు. కొబ్బరి, పండ్లు, పానీయ, క్యాటరింగ్, హోటల్, తినుంబండ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉండగలదు. మీ జీవితభాగస్వామి ప్రోద్బలంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. తలెపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

కన్య
స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాలకు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

తుల
బంధువులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ యత్నమూ కలిసిరాకపోవడంతో నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. స్త్రీలకు ఉదరం, నేత్ర సంబంధిత చికాకులు తలెత్తుతాయి. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో లౌక్యం అవసరం.

వృశ్చికం
ఉమ్మడి వ్యాపారాల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. హోటల్, క్యాటరింగ్ రంగాలలోని పనివారికి కలిసిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. దైవ కార్యాలలో పాల్గొంటారు.

ధనస్సు
కొబ్బరి, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి విజయం సాధించండి. ట్రాన్స్‌పోర్ట్ రంగాలలోని వారికి పనివారలతో చికాకులు తప్పవు.

మకరం
రాజకీయాలలోని వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.

కుంభం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ధన వ్యయం విషయంలో మెళకువ వహించండి. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదని గమనించండి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం అవుతాయి. విందులు, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో ఒత్తిడి చికాకులు తప్పవు.

మీనం
ఆర్థిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. విహార యాత్రలు అనుకూలిస్తాయి. స్త్రీలు పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు. చేతి వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మొండిబాకీలు సైతం వసూతవుతాయి. మిత్రులను కలుసుకుంటారు.