* ఏపీలో రేపటి నుండి నిత్యావసర వస్తువులు అమ్మకాలు 2 గంటలు తగ్గుస్తూ ఆదేశాలు.ఉదయం 6 నుండి 11 వరకే అమ్మకాలు చేయాలిఉదయం 11 వరకే నిత్యావసర వస్తువులు అమ్మకాలు జరగాలని మంత్రి ఆళ్ల నాని ప్రకటన..కరోనా నిరోధించడానికి ప్రజలు అందరు సహకరించాలి…నిత్యావసర వస్తువుల రవాణా కు ఆటంకం ఉండదు..
* ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో నేడు ప్రత్యేకంగా కోవిడ్-19పై మాట్లాడారు.కరోనా ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం, ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సేవలను ప్రధాని మన్ కీ బాత్‌లో ప్రసంగించారు.ఈ క్రమంలో భాగంగా కోవిడ్-19 భారిన పడి రికవరీ అయిన హైదరాబాద్‌కు చెందిన రామ్ అనే వ్యక్తితో ప్రధాని మాట్లాడారు.
* యువరాణి మారియా థెరిసా కన్నుమూశారు. కరోనా వైరస్ సంక్రమించడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్రిక్ డీబార్బన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలిపారు.మారియా వయసు 86 ఏళ్లు. స్పానిష్ రాయల్ ఫ్యామిలీలో మారియా సభ్యురాలిగా ఉన్నారు.రాచకుటుంబంలో కరోనా వల్ల మృతిచెందిన తొలి యువరాణిగా మారియా నిలిచింది. పారిస్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలను మాడ్రిడ్‌లో నిర్వహిచనున్నారు.
* కరోన మహమ్మారి సోకిన వారిలోకెనడా ప్రధానమంత్రి ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కూడా ఉంది.అయితే 16రోజుల చికిత్స అనంతరం గ్రెగొరీ పూర్తిగా కోలుకున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.అటు ఇదే విషయాన్ని స్వయంగా గ్రెగోరినే సోషల్ మీడియాలో వెల్లడించారు.కాగా సోఫి గ్రెగొరీ లండన్‌లోని ఓ కార్యక్రమానికి హాజరవ్వగా స్వల్ప జ్వరం రావడంతో ఆమెను పరీక్షించిన వైద్యులు మార్చి 12న కరోనా వైరస్ సోకిందని నిర్దారించారు. దీంతో ఆమె అప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.ఆమెతో పాటు ప్రధాని ట్రూడో వారి పిల్లలు కూడా ఇంటికే పరిమితమయ్యారు.ట్రూడో ఇంత కాలం ఇంటి నుంచే విధులు నిర్వరించారు. మరోవైపు కెనడాలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఆంక్షల్ని మరింత కఠినం చేశారు.
* ప్రధాని మోదీకి రాహుల్ లేఖ.కరోనా ఎదుర్కొనే విషయంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ పలు సూచలను చేస్తూ లేఖ రాశారు.సంక్షోభాన్ని అధిగమించే అంశంలో కేంద్రానికి అండగా ఉంటామని చెప్పారు రాహుల్ గాంధీ.
* కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రముఖ స్టీల్ వ్యాపార సంస్థ జేఎస్డబ్ల్యూ పీఎం కేర్స్ నిధికి రూ. 100కోట్ల విరాళం ప్రకటించింది.
* కేంద్రం తాజా ఆదేశాలు.రాష్ట్ర, జిల్లాల సరిహద్దులను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.సరుకు రవాణా మినహా జాతీయ రహదారులు, పట్టణాల్లో ఎటువంటి రవాణా జరగరాదు.జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు దీనికి బాధ్యత వహించాలి.సమయానుకూలంగా దినసరి కూలీలకు చెల్లింపులు జరపాలి. చెల్లింపులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయొద్దు.విద్యార్థులు, అద్దెకు ఉండే వారికి అవసరమైన సహకారాన్ని ఇవ్వాలని, అద్దె డిమాండ్ చేసే ఇంటి యజమానులపై చర్యలకు వెనుకాడవద్దని సూచన.సరిహద్దుల్లో ఉన్న దినసరి కూలీలను వెంటనే… 14 రోజుల పాటు నిర్బంధ పర్యవేక్షణకు పంపాలని కేంద్రం ఆదేశం.
* కేవలం కరోనా పేషెంట్స్ కోసం కింగ్ కోటి ఆస్పత్రిలో 350 బెడ్లను రెడీ చేశారు. హైదరాబాద్ లో ఇలాంటివి ఇంకా 4 ఆస్పత్రులును కేవలం కరోనా పేషెంట్లను ట్రీట్ చేసేలా అవసరమైన సదుపాయాలతో సిద్ధం చేస్తున్నారు.
* కరోనా వ్యాప్తి నివారణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు బయట తిరిగేందుకు ఇచ్చిన సమయాన్ని తగ్గించారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఇచ్చిన అనుమతి కొనసాగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తికి అడ్డంకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు కరోనాపై సీఎం ఆదివారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యువరాణి చనిపోయింది. ప్రధాని భార్య కోలుకుంది-TNI కొరోనా కథనాలు
Related tags :