కొరోనా వైరస్ కబంధ హస్తాల్లో చిక్కుని అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఆదివారం సాయంత్రం 7గంటలకు 140458మంది ఈ వైరస్ బాధితులుగా నిర్ధారణ చేయబడ్డారు. న్యూజెర్సీలో ఇవాళ ఒక్కరోజే 2136 కేసులు తాజాగా వెలుగుచూడగా, ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 13386కు ఎగబాకి ఇప్పటివరకు 161 మందిని బలి తీసుకుంది. అమెరికా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2480మంది మృత్యువాతపడ్డారు. ఈస్టర్ నాటికి ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని, యావత్ దేశాన్ని పునఃప్రారంభించాలని అనుకుంటున్నానని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్ ఆ ఆలోచనను విరమించుకున్నట్లు నేడు ప్రకటించారు. ఏప్రిల్ నెలాఖరు వరకు స్వచ్ఛంద స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించవల్సిందిగా ఆయన అమెరికన్లను కోరారు. కొరోనాతో విలవిలలాడుతున్న అమెరికాలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే బాధితుల నియంత్రణ చేయి దాటి లక్షల్లోకి చేరుతుందనే ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
లక్షన్నరకు చేరువలో కొరోనా బాధిత అమెరికన్లు
Related tags :