దేశంలో కోవిడ్ 19 ప్రభావం తీవ్రంగా ఉంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు మూతపడ్డాయి. ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న మోదీ సర్కార్.. అత్యవసర సేవలు మినహాయించి.. అన్నింటిని కూడా మూసేసింది. ఈ క్రమంలోనే జనాలకు మందుల పంపిణీ, అత్యవసర వస్తువులను అందించడం, పలు సదుపాయాల కోసం ప్రభుత్వాలు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. అత్యవసర సేవల కోసం ఉన్న ఈ హెల్ప్‌లైన్‌కు కొందరు ఆకతాయిలు ఫోన్ చేసి సిబ్బందిని విసిగిస్తున్నారు. ఓ ఆకతాయి ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి నాలుగు వేడి వేడి సమోసాలు కావాలని అడిగాడు. అంతకముందు కూడా ఇదే వ్యక్తి పిజ్జాలు కోరగా.. చిర్రెత్తుకొచ్చిన అధికారి, ఆ వ్యక్తితో డ్రైనేజీలు శుభ్రం చేయించి సరైన బుద్ధి చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు. కాగా, కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోలీసులు, డాక్టర్లు, ప్రభుత్వ సిబ్బంది బాధితులు, ప్రజలకు సేవలు చేస్తున్న సంగతి విదితమే.
అత్యవసర నెంబరుకు చేసి సమోసా అడిగాడు
Related tags :