తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1381 కేజీల బంగారం వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించారు.ఈ నెల 23వ తేదీలోగా దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తిరుమలకు వెళ్లి విచారణ జరపాలని సీఎస్ ఆదేశించారు. టీటీడీ బంగారం తరలింపులో భద్రతా లోపాలపై వస్తున్న వదంతులపై విచారణ చేయాలని, టీటీడీ, విజిలెన్స్ అధికారులు సమర్ధవంతంగా వ్యవహరించారా లేదా అనేదానిపై దర్యాప్తు చేయాలని సూచించారు.
శ్రీవారి బంగారంపై సీబీఐ విచారణ
Related tags :