విరాళాలను గురించి బయటకు ప్రకటించడం.. ప్రకటించకపోవడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం అని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంలో నానాటికీ విజృంభిస్తోన్న తరుణంలో దాని కట్టడి కోసం ఎంతో శ్రమిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పలువురు సినీ ప్రముఖులు తమవంతు ఆర్థిక సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు తారలు తమకు తోచినంత ఆర్థిక విరాళాలను పీఎం కేర్స్ ఫండ్‌కు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాళాలను అందచేయని పలువురు సినీతారలను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్న వారిలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా ఉన్నారు. దీంతో తన పై వస్తున్న ట్రోల్స్‌కు స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ పెట్టారు. ‘నేను ఎలాంటి విరాళాన్ని ప్రకటించలేదని పలువురు నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్‌పై నేనెంతో మౌనంగా వ్యవహరించాను. మంచి చేయండి కానీ దాని గురించి మర్చిపోండి అనే మంచిమాటను గుర్తుపెట్టుకోండి. మీరు మీ సమయాన్ని నిజమైన మంచి పనులు చేసేందుకు ఉపయోగించండి. విరాళాలను బయటకు ప్రకటించడం లేదా ప్రకటించకపోవడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతం’ అని సోనాక్షి తెలిపారు.
ఆ సంగతి మీకెందుకు?
![Actress Sonakshi Sinha Recent News-COVID19 Affect Actress Sonakshi Sinha Recent News-COVID19 Affect](;https://i.ytimg.com/vi/QVtyl0WOKWM/maxresdefault.jpg)
Related tags :