కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ముంబైలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డాక్టర్లు చేసిన పొరపాటు కారణంగా ఓ మహిళ, తన నవజాత శిశువు ఈ మహమ్మారి వైరస్ భారిన పడింది. వివరాలు.. ముంబైలోని చెంబూర్ శివారులో నివసిస్తున్నఓ వ్యక్తి గతవారం గర్భవతి అయిన తన భార్యను స్థానిక ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడే ఆరోగ్యవంతమైన శిశువుకు ఆమె జన్మనిచ్చింది. కొన్నిరోజుల తర్వాత వారు ఉన్న గదిలోనే ఒక రోగిని జాయిన్ చేశారు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పలేదు. దీంతో తన భార్య, మూడు రోజుల పసికందు కోవిడ్ -19 భారినపడ్టారని, తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేలకు విజ్ఞప్తి చేశాడు.
3రోజుల పాపకు కొరోనా
Related tags :