కరోనా మహమ్మారి సామాన్యులతోపాటు సంపన్నులనూ వణికిస్తున్నది. వైరస్ ఎప్పు డు.. ఎవరికి.. సోకుతుందో తెలియకపోవడం కలవరాన్ని కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు సంపన్నులు ముందస్తుగా ఆస్తుల పంపకంపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం దేశంలో కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు 108 ఉన్నాయి. తక్కువ టర్నోవర్ ఉన్న కుటుంబ వ్యాపారాలకు లెక్కే లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మన దేశంలోని 97 శాతం కుటుంబ వ్యాపారాల్లో వారసత్వంపై సరైన మార్గదర్శకాలుగానీ, పత్రాలుగానీ లేవు. వీరిలో కొందరు ఇప్పుడు ఆస్తుల పంపకంపై దృష్టిసారించారు. వీలునామా ముసాయిదా తయారుచేయాలంటూ కొన్నిరోజులుగా తమకు వినతులు పెరిగాయని న్యాయ సేవలు అందించే సంస్థలు తెలిపాయి. వీలునామా లేకుంటే భవిష్యత్తులో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఇబ్బందిపడుతారని తమ క్లయింట్లు గుర్తిస్తున్నట్టు కొందరు న్యాయవాదులు తెలిపారు. మరోవైపు ఇన్నాళ్లూ తీరిక లేకుండా గడిపిన వ్యాపారవేత్తలు ఇప్పుడు లాక్డౌన్ వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారని, కరోనా గురించి ఎక్కువగా వినడం వల్ల వారిలో తెలియకుండానే ఒక రకమైన భయం మొదలైందని మరికొందరు పేర్కొన్నారు. దీంతో వారి భార్యాపిల్లల సురక్షిత భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారన్నారు. కరోనా భయంతోపాటు మార్కెట్లు నష్టాల్లో నడుస్తుండటం, ఆర్థిక వ్యవస్థ పతనమవుతుండటం వంటి కారణాల వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పలువురు పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు.
కొరోనా నేపథ్యంలో…వీలునామాలు రాసేస్తున్నారు
Related tags :